సీఎం జగన్.. ఎన్నికలు ఇప్పుడైతేనే బెటర్‌..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇదివరకు రచ్చ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా ప్రారంభంలో ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లోకల్‌ బాడీ ఎన్నికలను వాయిదా వేశారు. అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తరువాత కమిషనర్‌ ఇలా చేయడం నచ్చని జగన్‌ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్న సంగతి అందరికీ తెలుసు. అయితే చివరిగా కోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ యథాస్థానానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యలో కరోనా విజృంభించడంతో ఎన్నికలు వాయిదా పడుతూ […]

Written By: NARESH, Updated On : October 26, 2020 1:02 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇదివరకు రచ్చ జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా ప్రారంభంలో ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లోకల్‌ బాడీ ఎన్నికలను వాయిదా వేశారు. అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తరువాత కమిషనర్‌ ఇలా చేయడం నచ్చని జగన్‌ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్న సంగతి అందరికీ తెలుసు. అయితే చివరిగా కోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ యథాస్థానానికి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ మధ్యలో కరోనా విజృంభించడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నారు.

Also Read: జగన్ సర్కార్ కు మోదీ శుభవార్త.. కడప జిల్లాలో..?

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా ప్రారంభంలో ఎన్నికలు వద్దన్న ఈసీ ఇప్పుడు నిర్వహించాలని అంటోంది. అయితే జగన్‌ ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా లేదు. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహించుకుంటేనే బెటరని కొందరు సీనియర్‌ రాజకీయ నాయకులు జగన్‌కు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుతం జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, ఇదే ఊపులో ఎన్నికలు నిర్వహిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు.

జగన్‌ ప్రవేశ పెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, కరోనాపై తీసుకుంటున్న చర్యలతో ఇప్పటికే  వైసీపీకి విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది.  మరోవైపు ప్రతిపక్ష బెడద అసలే లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా ముందు రాష్ట్రాన్ని విడిచి ఇప్పటి వరకు జనాల్లోకి రాలేదు. దీంతో ఆ పార్టీని చేరదీసే పరిస్థితి లేదు. ఇక వైసీపీపై ఎగిసిపడే టీడీపీ నాయకులపై ఏదో రకంగా భయపెట్టే కార్యక్రమాలు చేయడంతో వారు కూడా ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు. తాజాగా జగన్‌పై జనాల్లో విపరీతమైన ఆదరణ లభించిందని కొన్ని సంస్థలు సర్వే చేసి నివేదిక కూడా అందించారు.

Also Read: చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదట..!

అయితే అప్పుడు ఎన్నికలకు ముందడుగు వేసిన జగన్‌కు ఎన్నికల మిషన్‌ కళ్లెం వేసింది. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహించాలంటోంది.  పాత వివాదాన్ని పట్టించుకోకుండా ఎన్నికల సంఘం మాట సీఎం జగన్ వింటేనే సానుకూల వాతావరణం ఉంటుందని కొందరంటున్నారు. మళ్లీ ఎన్నికల సంఘంతో వివాదం పెట్టుకుంటే జనాల్లో క్రేజ్‌ తగ్గే అవకాశం ఉందని, అందువల్ల ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపాలని సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు..