Mekapati Goutham Reddy: గౌతం రెడ్డి మరణంతో ఏపీ కేబినెట్ లో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే కేబినెట్ విస్తరణ జరుగుతుందని అనేక కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సడెన్ గా వచ్చిన ఖాలీతో ఆయన నిర్వహించిన శాఖలను ఎవరికి అప్పగించాలనే చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది. ఈ విషయంపై జగన్ సజ్జలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. తనకు రాజకీయాల్లో మొదటి నుంచి అండగా ఉన్న మేకపాటి కుటుంబానికి ప్రధానమైన ప్రాముఖ్యత ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నాడట.
ఇందులో భాగంగానే మంత్రి పదవిని కూడా వారి కుటుంబానికి అప్పగించాలని చూస్తున్నారు. ఒకవేళ గౌతమ్ రెడ్డి భార్య శ్రీ కీర్తి ఒప్పుకుంటే ఆమెకే బాధ్యతలు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఆమె ఒప్పుకొని మంత్రి అయితే ఆరు నెలల్లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆత్మకూరు స్థానం ఖాళీ అయింది అంటూ కేంద్రానికి నివేదిక వెళ్ళింది. శ్రీ కీర్తి ఒప్పుకుని మంత్రి అయితే ఆమె వైసీపీ తరఫున అభ్యర్థి అవుతుంది.
Also Read: ఉక్రెయిన్ లో భారత విద్యార్థి మరణానికి ముందు ఏం జరిగింది? చివరి మాటలు వైరల్.. షాకింగ్ నిజాలు
ఏపీలో ఉన్న సాంప్రదాయం ప్రకారం ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుంది. ప్రాంతీయ పార్టీలు అయిన టీడీపీ, జనసేన ఎలాగూ పోటీ చేయవు. కాబట్టి అటు మేకపాటి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది ఇటు ఎన్నికల్లో ఈజీగా గెలిచినట్లు అవుతుందని జగన్ భావిస్తున్నారట. ఇందుకోసం నెల్లూరులో మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న వైసీపీ నేతలతో మాట్లాడాల్సిందిగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఆదేశించారు. 3, 4 తేదీల్లో సజ్జల వారితో భేటీ అవుతారు.
ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డితో శ్రీ కీర్తినీ ఒప్పించేందుకు చర్చిస్తున్నారు. 8వ తేదీన అసెంబ్లీలో గౌతమ్ రెడ్డిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలోనే జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా మంత్రిని తీసుకునే వరకు గౌతమ్ రెడ్డి నిర్వహించిన మూడు శాఖలను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ లకు జగన్ అప్పగించనున్నారు. అయితే వారు కొత్త మంత్రి వచ్చే వరకు తాత్కాలికంగా నిర్వహిస్తారు. ఒకవేళ శ్రీ కీర్తి ఒప్పుకుంటే ఆమెకు ఈ మూడు శాఖలను అప్పగిస్తారు.