https://oktelugu.com/

Suriya ET Telugu Trailer: ‘ఈటీ’ ట్రైలర్ తో ఆకట్టుకున్న సూర్య.. మరి ప్రభాస్ ను తట్టుకునేది ఎలా ?

Suriya ET Telugu Trailer: ‘జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. అయితే, జై భీమ్‌ వంటి మరొక సందేశాత్మక చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు సూర్య. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఈటీ. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను అందించాలని తపించే సూర్య, కొంత గ్యాప్‌ తీసుకొని మాస్‌ మసాలాతో పాటు కంటెంట్‌ ఉన్న చిత్రంగా దీన్ని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 2, 2022 / 04:14 PM IST
    Follow us on

    Suriya ET Telugu Trailer: ‘జై భీమ్’.. సూర్య నటించి, నిర్మించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకొంది. సూర్య అభిమానులను అయితే మెస్మరైజ్ చేసింది. అయితే, జై భీమ్‌ వంటి మరొక సందేశాత్మక చిత్రాన్ని తీసుకురాబోతున్నాడు సూర్య. సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఈటీ. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను అందించాలని తపించే సూర్య, కొంత గ్యాప్‌ తీసుకొని మాస్‌ మసాలాతో పాటు కంటెంట్‌ ఉన్న చిత్రంగా దీన్ని తీసుకొస్తున్నాడు.

    Suriya ET Telugu Trailer

    కాగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలవగా ఫ్యాన్స్‌కి విందు భోజనంలా ఉందనే చెప్పాలి. సూర్య మార్క్‌ ఫన్‌, యాక్షన్‌, ఫ్యామిలీతో పాటు ఓ సందేశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. పైగా సూర్య మొదటిసారి నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. కాగా ఈ ‘ET’ (ఎవరికీ తలవంచడు) తెలుగు ట్రైలర్ ను విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ట్రైలర్ సాలిడ్‌గా ఉందని, తన ఫేవరెట్ హీరో సూర్య సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు.

    Also Read: టుడే బాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

    ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, పాండిరాజ్ దర్శకత్వం వహించాడు. మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయిన ఈ మూవీ.. మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. అయితే, రాధేశ్యామ్‌ కూడా ఆ వీక్ లోనే రాబోతోంది. చిత్ర వర్గాల ప్రకారం ఈ సినిమా బాగా వచ్చిందని, ఇండియన్‌ టైటానిక్‌లా ఉంటుందంటున్నారు. పాజిటివ్‌ టాక్‌ వస్తే సూర్య సినిమా పరిస్థితి ఏమిటి అనేదే ఇక్కడి ప్రశ్న.

    ఒకవేళ.. రాధేశ్యామ్‌ కి సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం.. ఇక ఇండియా మొత్తం వసూళ్ల సునామీనే. ఎప్పుడూ బాక్సాఫీస్‌పై స్టార్ హీరోకే ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం సూర్య కంటే ప్రభాస్ పెద్ద స్టార్. కాబట్టి.. సూర్య పోటీని ఎలా తట్టుకుని నిలబడతాడో చూడాలి.

    Also Read: సోనాక్షిసిన్హాతో సల్మాన్ ఖాన్ రహస్య పెళ్లి.. పెళ్లి ఫొటోపై అసలు నిజాలు ఇవీ!

    Tags