Homeజాతీయ వార్తలుBihar Election Results: బిహార్‌ ఎన్నికల ఫలితాలపై సివిల్‌ సొసైటీ లేఖ.. ఎన్నికల కమిషన్‌ పారదర్శకతపై...

Bihar Election Results: బిహార్‌ ఎన్నికల ఫలితాలపై సివిల్‌ సొసైటీ లేఖ.. ఎన్నికల కమిషన్‌ పారదర్శకతపై విమర్శలు

Bihar Election Results: 2025 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించగా, విపక్షాల ఓటమిపై విస్తృత స్థాయిలో తిరస్కార స్వరం వినిపిస్తున్నది. తాజాగా 175 మంది సివిల్‌ సొసైటీ మేధావులు ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు నోట్‌ విడుదల చేశారు. ఇందులో ఇందులో సప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి. పరకాల ప్రభాకర్, తుషార్‌గాంధీ, షభ్నం హష్మీ, ప్రకాశ్‌రాజ్, నూర్‌ మన్సూర్, మీనా గుప్తా ఇలాంటి వాళ్లు ఉన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు ఓటెయ్యడానికి ఎందరో ప్రాముఖ్యతనిచ్చినప్పటికీ, ఆ ఓట్లను పారదర్శకంగా లెక్కించడంలో అవకతవకలకు పాల్పడినదని, విపక్షాలు కూడా విఫలమయ్యాయని, ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్లను తొలగించిందని ఆరోపించింది. ‘‘ఓటరు జాబితాల తయారీ వ్యూహాత్మకంగా అధికార పక్షానికి అనువుగా జరిగింది. లక్షల్లో ఓట్లు తొలగించబడ్డాయి’’ అని ఎస్‌ఐఆర్‌ (Special Intensive Revision) విధానం మండిపడి మండిపడ్డారు. ఇ-వీఎంలను మానిప్యులేట్‌ చేసినట్టు, జాబితాలు అప్‌డేట్‌ చేయడంలో అక్రమతలు జరిగాయన్న ఆరోపణలు ప్రతిపక్షాలదే కాక, మేధావులు, సామాజిక వేత్తల నుంచి కూడా వచ్చాయి.

విపక్షాలపై విమర్శలు..
ఈ ఫలితాలపై కాంగ్రెస్, ఆర్జేడీ, విపక్షాలు కేవలం రాజకీయ వ్యూహపు పరాజయం వల్లే కాకుండా, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ, చట్టబద్ధ సంస్థల పాత్రపై తీవ్ర అనుమానాలను వ్యక్తీకరించాయి. ‘‘మీడియా గోడలు దాటి ప్రజలకు విశ్వాసం కలిగించవచ్చు, కానీ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లేకపోతే ప్రజాస్వామ్య పునాదులే మొత్తం దెబ్బతింటాయి’’ అని మేధావుల ప్రకటనలో ఉంది. ఈ విరామంలో అధికార పార్టీకి అనుకూల ప్రచారం, విపక్ష బలహీనత, మారుతున్న సాంకేతిక పంథాలో ఈసీఐని ప్రతిపక్షాలు తప్పుపట్టడంలో ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

ఈసీ తీరుపై ఆగ్రహం..
అధికార పార్టీకి అనుకూలంగా ఓటరు జాబితాను ఈసీ రూపొందించిందని ఆరోపించారు. ఈవీఎంలను మ్యానిప్లేషన్‌ చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఎస్‌ఐఆర్‌ మూలంగా అవకతవకలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అధికార పార్టీ ప్రయోజనాలకు కాపాడేందుకు ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓటరు జాబితా తయారు చేస్తున్నారని తెలిపారు. ఈసీఐని చట్టబద్ధమైన సంస్థగా గుర్తించడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ సూత్రాలను ఈసీఐ అవమానిస్తోందని విమర్శించారు. పవిత్రతను కాలరాస్తోందని తెలిపారు. రాజ్యాంగబద్ధ, నిస్పక్షపాత ఈసీఐని నిర్మించాలి అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలను కూడా ఈ స్టేట్‌మెంట్‌లో తప్పు పట్టారు. ఈసీఐ అక్రమాలను ఎదుర్కొనడం లేదని, ఎస్‌ఐఆర్‌ లోపాలను ఎత్తి చూపడం లేదని ఆర్జేడీ, కాంగ్రెస్‌ను తప్పు పట్టారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు బిహార్‌ ఎన్నికల ఫలితాలను తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈసీఐ గానీ, జేడీయూగానీ, బీజేపీ గానీ స్పందించలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular