Chiranjeevi: ఓటీటీ లో సంచలన విజయం సాధించిన ఇండియన్ వెబ్ సిరీస్ లో ఒకటి ‘ది ఫ్యామిలీ మ్యాన్'(The Family Man). మనోజ్ బాజ్ పాయ్(Manoj Bajpai) ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికి రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కంటే రెండవ సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండవ సీజన్ లో విలన్ గా సమంత నటించడం, ఆమెకు ఆ తర్వాత ఉత్తమ విలన్ గా పలు అవార్డ్స్ కూడా దక్కడం విశేషం. త్వరలోనే మూడవ సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సీజన్ పై కూడా ఆడియన్స్ లో బజ్ మామూలు రేంజ్ లో లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ సిరీస్ ని ముందుగా దర్శక ద్వయం రాజ్ & డీకే సినిమాగా తియ్యాలని అనుకున్నారు. ముందుగా ఈ కథని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కి వినిపించారట.
ఆయనకు కథ అద్భుతంగా నచ్చడం తో వెంటనే చిరంజీవి వద్దకు తీసుకెళ్లి ఈ కథని వినిపించారట. ఆయనకు కథ బాగా నచ్చింది కానీ, ఖైదీ నెంబర్ 150 లాంటి భారీ కమర్షియల్ హిట్ తర్వాత ఇద్దరు పిల్లలకు తండ్రి పాత్ర పోషిస్తే జనాలు ఎలా తీసుకుంటారో అని చిరంజీవి ఒప్పుకోలేదట. అవసరమైతే ఆ ఇద్దరు పిల్లలను స్టోరీ నుండి తీసేద్దాం అని చెప్పినా ఎందుకో చిరంజీవి కి కరెక్ట్ కాదని అనిపించిందట. దీంతో రాజ్ & డీజీ దీన్ని వెబ్ సిరీస్ గా మార్చి మనోజ్ బాజ్ పాయి ని సంప్రదించారట. అతను మొదటి నుండి చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకొని వెళ్లే వ్యక్తి. వెబ్ సిరీస్ అనగానే శృంగారం, వయొలెన్స్ హద్దులు దాటి ఉంటుంది, అలాంటి ప్రాజెక్ట్స్ నేను చెయ్యను అని అన్నాడట. అప్పుడు డైరెక్టర్స్ మీరు అనుకున్న విధంగా అయితే అసలు ఉండదు, దయచేసి ఒకసారి కథ వినండి అని రిక్వెస్ట్ చేశారట.
ఈ విషయం మనోజ్ భార్య కి తెలిసిన వెంటనే ఆమె వెబ్ సిరీస్ ని టీవీ సీరియల్ అనుకుంది. ‘ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసి ఎందుకు కెరీర్ ని సర్వనాశనం చేసుకుంటావు’ అని ప్రశ్నించింది అట. అయితే ఆ తర్వాత సిరీస్ వచ్చాక కుటుంబ సభ్యులు మొత్తం చూసి ఎంతో ప్రశంసించారట. ఒకవేళ చిరంజీవి ఈ చిత్రాన్ని సినిమాగా ఒప్పుకొని చేసుంటే రీ ఎంట్రీ తర్వాత ఆయన కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ దొరికేది. బ్యాడ్ లక్ అంటే ఇదే అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.