KTR Revanth Reddy: ‘వైట్ చాలెంజ్’ కోర్టుకు చేరింది. మంత్రి కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిపై సిటీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనకు సంబంధం లేకున్నా తనపై డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశాడు. ఈరోజు ఈ కేసుపై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు రేవంత్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
పరువు నష్టం కేసులో ఇంజక్షన్ ఆర్డర్ పై వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కేటీఆర్ కోరారు. ఈ క్రమంలోనే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక నుంచి డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రేవంత్ రెడ్డికి ఇంజక్షన్ ఆర్డర్స్ జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘వైట్ ఛాలెంజ్’ పేరిట మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. తాను పరీక్షలకు సిద్ధమని రాహుల్ గాంధీ రెడీనా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కేటీఆర్ ట్వీటర్ వేదికగా రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీ ఎయిమ్స్ లో ఏ రకమైన పరీక్షకైనా నేను సిద్ధమే రాహుల్ వస్తాడా చర్లపల్లి బ్యాచ్ తో నేను టెస్టులు చేసుకుంటే నా గౌరవం తగ్గుతుందని ఎద్దేవా చేశారు. నాకు క్లీచ్ చిట్ వస్తే పదవికి రాజీనామా చేసి రేవంత్ క్షమాపణ చేస్తావా? అని ప్రశ్నించారు. ఓటుకు కోట్ల కేసులో లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించాడు.
మాటల యుద్ధం ముదరడం.. రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గక విమర్శలు ఎక్కువ చేయడంతో కేటీఆర్ కోర్టుకు ఎక్కాడు. రేవంత్ రెడ్డి పై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా వేశాడు. ఈ పిటిషన్ పై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. పరువు నష్టం దావాలో ఇంజెక్షన్ ఆర్డర్ పై వాదనలు ముగిశాయి. వాదనలను ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కేటీఆర్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు ఆదేశించింది