https://oktelugu.com/

Manchu Vishnu:  జగన్-చిరంజీవి భేటితో టాలీవుడ్ కు ఏం ప్రయోజనం లేదా?

Manchu Vishnu: వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న ఆవేదన టాలీవుడ్ లో నెలకొంది. ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఆన్ లైన్ టికెట్ల విధానం.. సినిమా టికెట్ ధరల తగ్గింపుపై టాలీవుడ్ సినీ పెద్దలంతా మౌనంగా ఉన్నారు. భరించారు. నిర్మాతలు, హీరోలు, దర్శకులు కిక్కురమనలేదు. జగన్ కరుణిస్తాడని ఆశించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో లంచ్ మీటింగ్ కు పిలిచి చర్చలు జరిపారు. ఇది జరిగి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 8, 2022 3:40 pm
    Follow us on

    Manchu Vishnu: వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న ఆవేదన టాలీవుడ్ లో నెలకొంది. ఏపీ సీఎం జగన్ తీసుకున్న ఆన్ లైన్ టికెట్ల విధానం.. సినిమా టికెట్ ధరల తగ్గింపుపై టాలీవుడ్ సినీ పెద్దలంతా మౌనంగా ఉన్నారు. భరించారు. నిర్మాతలు, హీరోలు, దర్శకులు కిక్కురమనలేదు. జగన్ కరుణిస్తాడని ఆశించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని ఆయన నివాసంలో లంచ్ మీటింగ్ కు పిలిచి చర్చలు జరిపారు. ఇది జరిగి నెలరోజులు కావస్తున్నా జగన్ నుంచి టాలీవుడ్ కు ఎలాంటి ఉపశమన చర్యలు లేవు.

    ఈ సమావేశం అనంతరం చిరంజీవి స్పష్టంగా చెప్పారు. ‘తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై, ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల వివాదంపై జగన్ తో చర్చించినట్లు స్పష్టంగా కుండబద్దలు కొట్టారు. అన్ని సమస్యలను సానుభూతితో పరిగణిస్తానని జగన్ హామీ ఇచ్చారని.. ఈ అంశంపై ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని సినీ పరిశ్రమలోని వారందరినీ అభ్యర్థించినట్లు చిరంజీవి తెలిపారు.

    అయితే చిరంజీవి భేటి జరిగి నెలరోజులు కావస్తున్నా.. ఇప్పటివరకూ సినిమా టికెట్ ధర విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి తదుపరి చర్యలు లేవు. అసలు చిరంజీవితో జగన్ సినీ పరిశ్రమ సమస్యలపై చర్చిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు బాంబు పేల్చారు. చిరంజీవి, జగన్ ల భేటి పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని.. తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.చిరంజీవి వ్యక్తిగత హోదాలో జగన్ ను కలిశాడని.. సినీ పరిశ్రమల సంఘం తరుఫున కాదని చులకన చేశారు. ఒకరిద్దరు చర్చలు జరిపి సమస్యగా మార్చడం సరికాదని హితవు పలికారు.

    దీన్ని బట్టి స్వయంగా మంచు విష్ణుకు బావ అయిన జగన్ ను కలవడానికి చిరంజీవికి ఆహ్వానం అందడం.. ఆయన వెళ్లడం మంచు ఫ్యామిలీ జీర్ణించుకోవడం లేదని అర్థమైంది. ఈ సమావేశంపైన మంచు విష్ణు అక్కసు చూస్తే అదే అర్థమవుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఇద్దరు హీరోలు, దర్శకులు, నిర్మాతల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ జగన్ ప్రభుత్వంతో వారు లాబీయింగ్ కు పాల్పడడాన్ని మంచు మోహన్ బాబు ప్రశ్నిస్తూ లేఖ రాశారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా అదే పాట పడడం హాట్ టాపిక్ గా మారింది.

    Manchu Vishnu Sensational Comments On Chiranjeevi Meeting With CM YS Jagan | OkTelugu Entertainment