https://oktelugu.com/

Mahesh: ప్రేమికుల దినోత్సవం రోజు రిలీజ్ కానున్న మహేష్ – కీర్తి లవ్ ట్రాక్ !

Mahesh: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. తాజాగా సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని మహేష్ మరియు కీర్తి సురేష్ ల మధ్య ప్లాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ […]

Written By: , Updated On : January 21, 2022 / 03:07 PM IST
Follow us on

Mahesh: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. తాజాగా సంగీత దర్శకుడు థమన్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని మహేష్ మరియు కీర్తి సురేష్ ల మధ్య ప్లాన్ చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రెడీ అయిందని తెలుస్తోంది. సంగీత సంచలనం తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట

Mahesh

Mahesh

అందుకే ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉందని తెలుస్తోంది. ఎలాగూ సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే సినిమాకు బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది.

Also Read: తన పార్టీని కాంగ్రెస్‌లో కలపాలని ‘చిరు’ ముందే అనుకున్నారా..? సీక్రెట్స్ చెప్పిన ఉండవల్లి

Mahesh Babu

Mahesh Babu

తన తండ్రిని మోసం చేసి, వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి ఆ డబ్బును మహేష్ బాబు ఎలా రాబట్టాడనే కోణంలో ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ప్లేతో సాగనుంది. ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. మైత్రీ – 14 రీల్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే షెడ్యూల్ నుంచి కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత, మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాంగ్స్ ను షూట్ చేస్తారట.

Also Read: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. దెబ్బకు అత్యవసర కేబినెట్ భేటీ పెట్టిన జగన్..!

Tags