megastar Chiru Ramcharan: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. కరోనా కేసులు అదుపులోకి రావడంతో ఇక సినిమాలపై దృష్టి పెట్టారు. మొన్నటి వరకు కరోనా కేసులతో పాటు ఏపీలో టిక్కెట్ల విషయంలో కాస్త వివాదం సాగడంతో ఆ సమస్య పరిష్కారంలో పాలు పంచుకున్నాడు. ఆ సమయంలో తాను రాజకీయాల్లోకి వెళ్లలేనని తేల్చి చెప్పాడు. సినిమాల్లో మాత్రమే ఉంటానని పేర్కొన్నాడు. అయితే తాజాగా చిరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా..? అనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా చిరుతో పాటు రామ్ చరణ్ కూడా తండ్రి బాట పడుతున్నారా..? అని అనుకుంటున్నారు. రాజకీయాలు వద్దు బాబోయ్ అని పేర్కొన్న చిరు మళ్లీ రాజకీయాల్లోకి రావడమేంటి..? అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. అయితే మీకు ఆ సందేహం అక్కర్లేదు.. ఎందుకంటే..?
చిరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైప్లో. అవును చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పొలిటికల్ డ్రామా ఉండనున్న విషయం ఇప్పటికే తెలిసింది. ఈ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు చిరు బిజీ కానున్నాడు. మలయాళం మూవీ ‘లూసీఫర్’ రీమేక్ చిత్రంగా ‘గాడ్ ఫాదర్’ వస్తోంది. ఇందులోచిరంజీవి మెయిన్ రోల్ చేయనున్నారు. ‘లూసిఫర్’లో మోహన్ లాల్ పాత్రను తెలుగులో చిరు చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన సినిమా విశేషాలను ఇప్పిటికే ప్రకటించారు. అయితే తాజాగా చిరు ఈ సినిమా షూటింగ్ కోసం బిజీ కానున్నాడు.
Also Read: ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఎలా ఉందంటే.. ?
చిరు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లోకేషన్స్ ను చిరు రిలీజ్ చేశాడు. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరు పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. ఏమాత్రం మకిలీ లేని రాజకీయనాయకుడి పాత్రను పోషించనున్నాడు. ఈ సినిమాలో ‘జనజాగృతి’ అనే పొలిటికల్ పార్టీలో కీలక పాత్ర పోషించే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉంది. చిరు షేర్ చేసిన లోకేషన్స్ లో ఆ పార్టీకి సంబంధించిన బ్యానర్లు మనకు కనిపిస్తాయి. అయితే ఈ పేరు పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి దగ్గరగా ఉందని కొందరు అంటున్నారు.
ఇదిలా ఉండగా రామ్ చరణ్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడా..? అనే విషయంపై చర్చిస్తే ఆయన కూడా రాజకీయాలతో సంబంధం ఉన్న సినిమాలనే చేస్తున్నాడని తెలుస్తోంది. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ త్వరలో ‘ఆర్ సీ 15’ సినిమాలో నటించే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లాగే కొనసాగే అవకాశం ఉంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ తీస్తున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. అయితే ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను దిల్ రాజు -శిరీశ్ కలిసి నిర్మిస్తున్నారు.
రాజకీయ అంశంతో సినిమాలు తీయడంలో శంకర్ కు మంచి పట్టు ఉంది. దీంతో ‘ఆర్ సీ 15’ సినిమాలో కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను తీసుకున్నారని అంటున్నారు. దీంతో ఇందులో కూడా రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నారని అంటున్నారు. ఇందులో ‘అభ్యుదయ పార్టీ’ లీడర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక నిజాయితీ గల బ్యాూరో క్రాట్ ప్రభుత్వంతో పోరాడేందుకు బయటకు వచ్చేసి ‘అభ్యుదయ పార్టీ’ని ఏర్పాటు చేసి పోరాడే సీన్స్ ఉంటాయని అంటున్నారు. మరో విశేషమేంటంటే చిరంజీవి ‘పునాదిరాళ్లు’ సినిమా మొదలు పెట్టిన చోటే రామ్ చరణ్ ‘ఆర్ సీ15’ షూటింగ్ ప్రారంభించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1978లో ఫిబ్రవరి 11న చిరు ‘పునాదిరాళ్లు’ సినిమా షూటింగ్ చేశారు.
Also Read: కరణ్ జోహార్ ని జైల్లో బంధిస్తోందట.. బిగ్ బాస్ ను బీట్ చేస్తోందా ?