Alay Bhalay Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి మరోసారి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనియాడారు. తెలంగాణ సంస్కృతిలో ఎంత పగ ప్రతీకారాలు ఉన్నా కూడా ఆ ఆప్యాయతలు మాత్రం ఎప్పుడూ ఎదుటి వారి మనసు దోచేస్తాయని.. ‘అలయ్ బలయ్’ లాంటి కార్యక్రమాలు తెలంగాణ మనస్తత్వాలకు ప్రతిబింబం అని అన్నారు.

దసరా తర్వాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే ‘అలయ్ బలయ్’లో ఈసారి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సినిమా హిట్ అయినా.. 100 రోజులు అయినా కూడా తన మిత్రులందరినీ పిలిచి పార్టీ ఇచ్చేవాడిని.. బాలయ్య, వెంకటేశ్, నాగార్జున సహా తమిళ హీరోలకు పార్టీలు ఇచ్చేవాడినని.. ఆ అనుబంధం ఇప్పటికీ తనకు గుర్తు ఉంటుందని.. అలాంటి అనోన్యత.. ఆపాయ్యత తెలంగాణ సంస్కృతిలో ఉందన్నారు.
తెలంగాణ సంస్కృతిలో దసరా తర్వాత జమ్మి ఆకు తీసుకొచ్చి పెద్ద వారి కాళ్లకు మొక్కి.. చిన్న వారికి కౌగిలించుకొని ఒక మంచి సంప్రదాయం నెలకొల్పారని.. ఇది తెలంగాణ వారంతా ఉన్న దేశ, విదేశాల్లో నిర్వహించడం ఒక గొప్ప పరిణామం అని.. దీన్ని నిర్వహిస్తున్న దత్తాత్రేయకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ లోనూ బుతూలు తిట్టుకునే నేతలు.. బయటకొచ్చి ఆహ్లాదంగా అన్యోన్యంగా మాట్లాడుకుంటారని.. ప్రజా సమస్యలపై కొట్లాట వ్యక్తిగత విషయాల్లో ఉండదని.. అది చూసి తాను ఇన్ స్పైర్ అయ్యానని చిరంజీవి తెలిపారు. చిరంజీవి మాట్లాడిన మరిన్ని వీడియోలు కింద చూడొచ్చు.