Godfather Collections: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు అతి తక్కువ థియేటర్స్ మరియు టికెట్ రేట్స్ తో విడుదలైనప్పటికీ కూడా మంచి వసూళ్లను రాబట్టింది..ఇక రెండవ రోజు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మెగాస్టార్ శివ తాండవం ఆడేసాడు అనే చెప్పాలి..మార్నింగ్ షోస్ నుండే ప్రతి చోట హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ ప్రారంభమైన ఈ సినిమా మాట్నీ షోస్ నుండి మొదటి రోజు కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలతో ప్రారంభం అయ్యాయి..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపొయ్యేలా చేసింది గాడ్ ఫాదర్..ఇటీవల కాలం లో ఈ స్థాయి వసూళ్లు చూసి చాలా కాలమే అయ్యింది అంటున్నారు ట్రేడ్ పండితులు..ఈమధ్య కాలం లో విడుదల అవుతున్న కొత్త సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ అవుతుండడం తో థియేటర్స్ ఫీడింగ్ లేక పాత సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటున్న సమయం లో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి కొత్త ఊపిరి పోసింది అంటూ డిస్ట్రిబ్యూటర్స్ కొనియాడుతున్నారు.

ఇక ఈ సినిమా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు 9 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు..ముఖ్యంగా ఈ చిత్రం నైజాం ప్రాంతం లో నిన్నటి కంటే ఈరోజు అద్భుతమైన ఆక్యుపెన్సీలను కనబర్చింది..చిన్న చిన్న టౌన్స్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని నమోదు చేస్తూ సంచలనం సృష్టించింది..ఒక్క మాటలో చెప్పాలంటే నైజాం ప్రాంతం లో రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ ఉంటుంది అనే చెప్పాలి..ఈ ప్రాంతం లో రెండవ రోజు సుమారు 3 కోట్ల 50 లక్షల రూపాయిలు వసూలు చేస్తుందట..ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని సీడెడ్ ,ఉత్తరాంధ్ర,నెల్లూరు,కృష్ణ , గుంటూరు మరియు గోదావరి జిల్లాలు కలిపి 8 కోట్ల రూపాయిల షేర్..
మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇదే ఫ్లో ఒక వారం రోజులు కొనసాగితే బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ అవ్వాలంటే 92 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టాలి..ప్రస్తుతానికి అయితే అది దాదాపుగా సాధ్యం అనే చెప్పొచ్చు..చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
[…] Also Read: Godfather Collections: ‘గాడ్ ఫాదర్’ 2 వ రోజు వసూళ్లు..… […]
[…] Also Read:Godfather Collections: ‘గాడ్ ఫాదర్’ 2 వ రోజు వసూళ్లు..… […]
[…] Also Read:Godfather Collections: ‘గాడ్ ఫాదర్’ 2 వ రోజు వసూళ్లు..… […]