Will BJP Get Reservation for Pahadis : అమిత్ షా కశ్మీర్ పర్యటన ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజోలి, బారాముల్ల లాంటి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించడం సంచలనమైంది. ఈ సభలు మోడీ మోడీ నినాదాలతో దద్దరిల్లిపోయింది. బీజేపీ సభకు ఈ తరహా స్వాగతం కశ్మీర్ లో ఊహించలేదు.

గుజ్జర్ లు ఆదివాసీలు, పహాడీలు కొండ ప్రాంతాల్లో నివసించే వీరు.. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాదం నడుస్తోంది. గుజ్జర్ బక్కర్ వాలాలు రాజస్థానీ తెగకు చెందిన వారు.. వీళ్లు అందరూ ముస్లింలు.. గొర్రెలు, ఆవులు, పశువుల పెంపకం ప్రధాన వృత్తి. వీళ్లు సంచార జీవితం గడుపుతారు. వీరిని ఎస్టీల రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాల్లో మేలు చేకూర్చారు.
పహాడీలు కూడా ఇదే రాజోలీ, పూంచ్ లోనే ఉంటారు. వీరు గుజ్జర్ ల కంటే ఎక్కువగా ఉంటారు. వీళ్లలో హిందువులు, ముస్లింలుగా ఉంటారు. అయితే వీరికి రిజర్వేషన్లు భాషపరంగా రిజర్వేషన్లు ఇవ్వలేదు. మాకూ ఎస్టీ కోటా ఇవ్వాలని పహడీలు ఆందోళన చెందుతున్నారు. కానీ మోడీ ప్రభుత్వం తరుఫున అమిత్ షా పహడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు.
పహడీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తామనగానే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు అలెర్ట్ అయ్యాయి. పహడీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అమిత్ షా చెప్పడంతో అది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలోనే ఇందులో రాజకీయం ఏంటి? పహాడీలకు రిజర్వేషన్లు బీజేపీకి లభిస్తుందా? అసలేంటి రిజర్వేషన్లు.? ఈ కథేంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..