Megastar Chiranjeevi: ‘మా’ ఎన్నికల ప్రారంభం కావడంతో అతిరధ మహారధులు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే నటసింహం బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు మోహన్ బాబు, నటుడు పోసాని కృష్ణ మురళి తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ మీడియా పై పంచ్ లు వేశారు. ‘ఇప్పుడు జరుగుతున్న పరిణామాల కారణంగా మీ మీడియాకు మంచి మెటిరియల్ దొరికింది కదా.. ఈ పరిస్థితిలో మీరు ఆనంద పడాలి కదా’ అంటూ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియా ప్రతినిధులతో చమత్కరించడం విశేషం. మా ఎన్నికల పై మీడియా చేసిన హడావిడి పై చిరు ఈ విధంగా సెటైర్ వేశారు.
ఇక ఎన్నికల్లో తన మద్దతు పై కూడా చిరు పెదవి విప్పారు. ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే తన మద్ధతు ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని, కాకపోతే మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాలి అని చిరు అభిప్రాయపడ్డారు. ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలని మెగాస్టార్ చెప్పారు.
మొత్తానికి ప్రకాష్ రాజ్ కే తన మద్దతు అని చిరు చెప్పకపోవడం విశేషం. పైగా ‘నేను వ్యక్తిగతంగా ఏ ఓటరును ప్రభావం చేయనని, తన అంతరాత్మను అనుసరించి ఓటేశానని, అది ఎవరికి అనేది మాత్రం చెప్పనని చిరు తెలియజేశాడు. ఇక ఓటు వేయడానికి మిగిలిన స్టార్ హీరోలు రావడం లేదు, దీని పై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే..
‘ఓటు వేయకపోవడం అనేది వ్యక్తిగత విషయం, ఓటు వేయని వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏమీ చెప్పలేను’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే మెగా ఫ్యామిలీ అంతా ప్రకాశ్ రాజ్‌కే మద్దతు ఇస్తున్నారని తెలిసిందే. ఒకవేళ ప్రకాష్ రాజ్ ఓడిపోతే.. అది ఫ్యామిలీకే అవమానం కాబట్టి.. తమ మద్దతును చిరు, ప్రకాష్ రాజ్ కి డైరెక్ట్ గా ప్రకటించలేదు.