Homeఆంధ్రప్రదేశ్‌Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్‌ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా...? 

Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: చిరంజీవి రాక పవన్‌ కళ్యాణ్‌కి లాభమా..? నష్టమా…? 

Chiranjeevi Arrival Benit for Pawan Kalyan: హనుమంతుడు లేకుంటే శ్రీరాముడు సప్తసముద్రాలు దాటి సీతను రక్షించేవాడు కాదు. శ్రీకృష్ణుడు లేకుంటే.. అర్జునుడు మహాభారత యుద్ధం గెలిచేవాడు కాదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రజాసేవే పరమార్థంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయా పోరాటం చేస్తున్న జనసేనానికి ‘అన్నయ్య’ చిరంజీవి కూడా శ్రీకృష్ణుడిగా, హనుమంతుడిగా కాకపోయినా ఒక సైనికుడిగా తనవంతు సాయం చేయలనుకుంటున్నారు. రాజకీయ పార్టీ స్థాపన, తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీ విలీనంతో స్వీయ అనుభంవం పొందిన మెగాస్టార్‌.. ప్రస్తుతం భవిష్యత్‌ రాజకీయాలపై దృష్టిపెట్టారు. పొలిటికల్‌ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఇందుకు సంకేతంగా త్వరలో విడుదల కాబోతున్న గాడ్‌ఫాదర్‌ సినిమాలోని ‘నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ, రాజకీయం నానుంచి దూరం కాలేదు’ అనే డైలాగ్‌ను చిరంజీవి రిలీజ్‌ చేశారు. ఈ డైలాగ్‌ పొలిటికల్‌ సర్కిల్‌లో పెను సంచలనంగా మారింది. అన్ని రాజకీయ పార్టీల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న మెగాస్టార్‌ పొలిటికల్‌ ఎంట్రీ కూడా మేగా రేంజ్‌లో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Aslo Read: Chicken Skin: చికెన్ స్కిన్ తో తింటే నష్టమా? లాభమా?

Chiranjeevi Arrival Benit for Pawan Kalyan
Chiranjeevi

సైనికుడై వస్తే..

మెగాస్టార్‌ పొలిటికల్‌ రీ ఎంట్రీ జనసేన పార్టీతోనే ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చిరంజీవి జనసైనికుడై వస్తే 2024 ఎన్నికల్లో పార్టీకి తిరుగు ఉండదని పేర్కొంటున్నారు. మెగాస్టార్‌ తిరిగి పార్టీలోకి వస్తే గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్తామని అంటున్నారు. చిరు ఎంట్రీతో జన సేన పార్టీకి సైనికుడు కాదని బాహుబలి దొరికినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనసేనకు ‘మెగా’ బలం..

Chiranjeevi Arrival Benit for Pawan Kalyan
Chiranjeevi

హీరో చిరంజీవికి తెలుగు సినిమాతోపాటు సౌంత్‌ ఇండస్త్రీలో మంచి గుర్తింపు ఉంది. గతంలో ఇదే ధైర్యంతో ప్రజారాజ్యం స్థాపించారు. కానీ కొన్ని తప్పిదాలతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చింది. రాజకీయాలు, ప్రజాసేవలై చిరంజీవికి ఎంతో ఆసక్తి ఉంది. మెగా కుటుంబం కూడా ప్రజాసేవలో ముందు ఉంటుంది. ఇండస్ట్రీలోనూ ఆర్టిస్టులు, కార్మికులను ఆ కుటుంబం ఆపదలో ఆదుకుంటుంది. బ్లడ్‌బ్యాంక్, ఐబ్యాంక్‌ ద్వారా చిరంజీవి ఇప్పటికే అనేకరకాలుగా సేవ చేస్తున్నారు. ఇంతటి ఆదరణ ఉన్న మెగాస్టార్‌ జనసేనతో పొలిటికల్‌ రీఎంట్రీ ఇస్తే కచ్చితంగా అది ఆ ఆపార్టీకి పెద్ద బలం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం విఫలమైన వ్యక్తిగా చిరంజీవి నిలబడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలిచి 70 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. తెలంగాణలో ఒకే సీటు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో 17 సీట్లు గెలిచాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ జనసేనలోకి వస్తే పవన్‌ కళ్యాణ్‌కు చిరంజీవి బలం తోడవుతుందని, అభిమానుల పరంగా, సామాజిక పరంగా ఒటుబ్యాంకు భారీగా పెరుగుతుందనే చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో జరుగుతోంది.

Also Read: RRR Oscar: ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ఆశలు ఇంకా బ్రతికే ఉన్నాయి… ఇలా బరిలో దిగవచ్చు! 

Recommended videos:

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular