Nara Lokesh Padayatra: తెలుగునాట ‘పాదయాత్ర’లకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలుపుబాట పట్టించారు. అటు తరువాత చంద్రబాబు పాదయాత్ర చేసి విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని విజయతీరాలకు చేర్చగలిగారు. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలం పర్యటించి వైసీపీని కనివినీ ఎరుగని విజయాన్ని అందించగలిగారు. ఒక్క జగన్ సోదరి షర్మిళ విషయంలో మాత్రమే పాదయాత్ర ఫలితమివ్వలేదు. 2014 ఎన్నికలకు ముందు సోదరుడు జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిళ పాదయాత్ర చేశారు. వందలాది కిలోమీటర్లు తిరిగారు. కానీ వైసీపీని గెలిపించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె సోదరుడితో విభేదించి తెలంగాణా వైఎస్ఆర్ టీపీని స్థాపించి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. అయితే ఏపీలో మరోవారసుడు నారా లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తుండడం అంతటా హాట్ టాపిక్ గా మారింది. మహానాడు సక్సెస్ కావడంతో ఊపు మీద ఉన్న టీడీపీ మరో రెండేళ్లు ప్రజల మధ్యనే ఉండాలని భావిస్తోంది. అందులో భాగంగా చంద్రబాబు పర్యటనల షెడ్యూల్ ఖరారైంది. అదే సమయంలో లోకేష్ పాదయాత్ర చేపట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మొన్న మహానాడులో ఇవే సంకేతాలు వెలువడగా.. టీడీపీకి సలహాదారుడిగా, అనుంగ మిత్రుడుగా, టీడీపీ అధికారంలోకి రావాలన్న బలమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తి అయిన ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాక్రిష్ణ నోటి నుంచి ఇదే మాట రావడంతో లోకేష్ పాదయాత్ర చేస్తారన్నదానికి మరింత బలం చేకూరుస్తోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పాదయాత్రలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా లోకేష్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మహానాడు ఇచ్చిన జోష్ తో దేనికైనా రెడీ అనేలా లోకేష్ అంటున్నట్లు సమాచారం.
నాటి నినాదంతో.,.
2024లో క్విట్ జగన్.. సేవ్ ఏపీ అనే నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు చెప్పడంతో.. అదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది టీడీపీ స్ట్రాటజీగా తెలుస్తోంది. సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో బైబై బాబు అనే స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో టీడీపీ కూడా ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో అవుతోంది. పాదయాత్రకు లోకేష్ కూడా ఆసక్తి చూపిస్తుండటంతో త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.అటు చంద్రబాబు కూడా జిల్లా టూర్లు ప్లాన్ చేస్తున్నారు. మహానాడుకు ముందు ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాల్లో బాదుడే బాదుడు పేరుతో పర్యటించిన చంద్రబాబు.. రానున్న పదినెలల్లో జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Mallareddy: అద్భుత విద్యావేత్త మల్లారెడ్డికి అర్జెంటుగా విద్యా శాఖ అప్పగిస్తే ఏమవుతుంది?
మహానాడులో లోకేష్ వ్యాఖ్యానాల్లో పరిణితి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహానాడు వేదికపై లోకేష్ చేసిన కామెంట్స్ పార్టీలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీ పదవుల విషయంలో కఠిన నిర్ణయాలు తప్పవని చెప్పిన సంగతి తెలిసిందే. వరుసగా మూడేళ్లు ఒకే పదవిలో ఉండరాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తాను తప్పుకొని వేరే వాళ్లకు అవకాశమిస్తానని లోకేష్ అన్నారు. అలాగే వరుసగా మూడేళ్లు ఓడిపోయిన నేతలకు కూడా టికెట్ ఇవ్వారదన్నారు. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని లోకేష్ చెప్పడంతో.. ఆయనే పార్టీ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ గెలిస్తే.. ఇప్పటివరకు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చని లోకేష్ భావిస్తున్నారు. అందుకే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను విరించడమే కాకుండా.. తాము వస్తే ఏం చేస్తామో వివరించాలని చూస్తున్నారట. ఇప్పటికే మంగళగిరిలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్.. ఇకపై నియోజకవర్గానికే పరిమితం కాకుండా.. రాష్ట్రమంతా తన మార్క్ చూపించాలని భావిస్తున్నట్లు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. మరి లోకేష్.. నిజంగానే పాదయాత్ర చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాలి.
Also Read: Mahesh Babu Waiting For Her Video: ఆమె వీడియోల కోసం మహేష్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు !