Chinajiyar Swamy: అంతే.. అంతే..! కేసీఆర్ తో దోస్తీ ఉన్నంత కాలం.. ‘చినజీయర్ స్వామి’ మహిమాన్వితుడు.. కేసీఆర్ సైతం కాళ్లు మొక్కేంతటి అపర గురువర్యులు.. ఆయనపై ఈగ వాలనీయలేదు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ తో విభేదాలు వచ్చాయో ‘స్వామి’కి ‘అయిపోయే.. అంతా అయిపాయే..’ ఎక్కడెక్కడివో.. పాత వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ చేస్తూ చినజీయర్ స్వామిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తాజాగా గతంలో మాట్లాడిన సమ్మక్క సారలమ్మల వీడియో వైరల్ అయ్యింది. వారిని దేవతలు కాదంటూ చినజీయర్ అన్న మాటలు వివాదాస్పదమయ్యాయి. వాటిపై గిరిజనులు భగ్గుమన్నారు. గిరిజన ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు. ఆఖరుకు దేవుళ్లను నమ్మని నాస్తికుడైన సీపీఐ నారాయణ సైతం చినజీయర్ స్వామిని తప్పుపట్టడం విశేషం. దీన్ని బట్టి కేసీఆర్ తో పెట్టుకున్నాక చినజీయర్ స్వామి ప్రతిష్ట మసకబారుతోందని అర్థమవుతోంది. ఆయనపై వరుస వివాదాలు ఆయనకే ఎసరు తెస్తున్నాయని తెలుస్తోంది. అధికారంలో ఉంటే ఏమేం చేయచ్చో.. ఎంతలా టార్గెట్ చేసుకోవచ్చో చినజీయర్ స్వామి ఉదంతమే మనకు గొప్ప ఉదాహరణ అని చెప్పొచ్చు.
ఈ మధ్య అద్వైతం, సమతామూర్తియే గొప్పవాడంటూ మాట్లాడి చినజీయర్ స్వామి తొలి వివాదంలో చిక్కుకున్నారు. ఆదిగురువుగా అభివర్ణించి.. ఇతర దేవతలను అవమానించాడంటూ ఇతర గురువులు విరుచుకుపడ్డారు. ఇక ఒక కుల సంఘాన్ని అవమానించారంటూ వారంతా రోడ్డెక్కారు. అక్కడితో ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడలేదు. తాజాగా ‘సమ్మక్క-సారలక్క’ను అసలు దేవతలు కాదంటూ నోరుపారేసుకొని చినజీయర్ స్వామి అడ్డంగా బుక్కయ్యారు.
కేసీఆర్ తో సాన్నిహిత్యంగా ఉన్నంత వరకూ కూడా చినజీయర్ స్వామి ఏం మాట్లాడినా చెల్లింది.ఆయనపై ఈగ వాలకుండా కేసీఆర్ సర్కార్ కాపు కాచింది. దీంతో ఎవరూ నోరు మెదపడానికి కూడా సాహసించలేదు. ఎప్పుడైతే సమతామూర్తి విగ్రహావిష్కరణకు కేసీఆర్ దూరమవ్వడం.. మోడీతో ఆ విగ్రహాన్ని చినజీయర్ ఆవిష్కరింపచేయడం.. ఆ తర్వాత శిలాఫలకంలో కేసీఆర్ పేరు లేకపోవడంతో ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయని ప్రచారం గుప్పుమంది.
Also Read: TRS Party Dissent: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?
ఈ క్రమంలోనే తెలంగాణలో అతిపెద్ద దేవాలయమైన యాదాద్రిని చినజీయర్ స్వామి చేతుల్లో పెట్టి నిర్మిస్తున్న కేసీఆర్ ఇటీవల ఆయనను దూరం పెట్టి ఒక్కడే పర్యవేక్షించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. ఎప్పుడైతే కేసీఆర్ కు, చినజీయర్ కు చెడిందని తెలియగానే ‘మంచి స్వామి’ కాస్త విలన్ అయిపోయాడు. ఇప్పుడు పాత వీడియోలన్న బయటకు తీసి మరీ ఫాపం స్వామిని వివాదాల్లోకి లాక్కెళుతున్నారు. ఆయన మౌనంగా ఉన్న నెటిజన్లు, నేతలు వదలడం లేదు.
ఎప్పుడో సమ్మక్క సారలక్కలపై మాట్లాడితే ఇప్పుడు దాన్ని వైరల్ చేయడం వెనుక ఎవరో వైరి వర్గాల కుట్ర ఉందన్నది కాదనలేని వాస్తవం. చినజీయర్ స్వామి మాట్లాడింది తప్పే.కానీ దానికి చిలువలు పలవులు చేసి అభాసుపాలు చేస్తున్న తీరే అనుమానస్పదంగా మారింది. పాలకులతో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇలా చేస్తారని తెలిస్తే పాపం చినజీయర్ స్వామి కూడా కాస్త ఈ వివాదాలకు విభేదాలకు దూరంగా ఉండేవాడేమో.. కానీ ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కేసీఆర్ తో విభేదాల తర్వాతే స్వామి శిఖరం కాస్తా.. అథమం స్థాయికి దిగజారారని చెప్పొచ్చు. అయినా చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటే ఇదేనేమో..!
Also Read: Jayalalitha Shoban Babu Daughter: జయలలిత, శోభన్ బాబు కూతురుని నేనే.. ఆధారాలు ఉన్నాయంటున్న మహిళ..