కబళిస్తున్నచైనా.. మళ్లీ దురాక్రమణ

చైనా కుయుక్తులు పన్నుతోంది. కుట్రలతో భారతదేశాన్ని అతలాకుతలం చేయాలని చూస్తోంది. తన కుతంత్రాలతో సరిహద్దులో ఉన్న భారత్ ను ఇరుకున పెట్టాలని భావిస్తోంది. చైనా తన పంథా మార్చుకుందని భావించినా ఆ చర్యలేవి కనిపించడం లేదు. టిబెట్ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువ అవుతోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం శ్వేతపత్రం […]

Written By: Srinivas, Updated On : May 22, 2021 1:20 pm
Follow us on


చైనా కుయుక్తులు పన్నుతోంది. కుట్రలతో భారతదేశాన్ని అతలాకుతలం చేయాలని చూస్తోంది. తన కుతంత్రాలతో సరిహద్దులో ఉన్న భారత్ ను ఇరుకున పెట్టాలని భావిస్తోంది. చైనా తన పంథా మార్చుకుందని భావించినా ఆ చర్యలేవి కనిపించడం లేదు. టిబెట్ సరిహద్దులోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువ అవుతోంది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయమై చైనా శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేసింది. 1951 నుంచి టిబెట్ విమోచనం, అభివృద్ధి, శ్రేయస్సు అంటూ పేర్లు పెట్టారు.

హిమాలయ ప్రాంతంలోని నాలుగు వేల కిలోమీటర్ల సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం కావడంతో సరిహద్దు గ్రామాల అభివృద్ధి పేరిట చైనా వ్యూహాలు రచిస్తోంది. కమ్యూనిస్టు పార్టీ సూచన మేరకు పేదరికంలో అవస్థలు పడుతున్న టిబెట్ సరిహద్దు గ్రామాల అభివృద్ధి పనులకు ఏటా నిధులు కేటాయింపులు పెంచుతామని చైనా ప్రకటించింది. 2012లో జిన్ పింగ్ అధికారంలోకి వచ్చాక చైనా సరిహద్దుల అభివృద్ధి కొత్త గ్రామాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది.

టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికపై ఆమోదం కావాలని, అలా కాకుండా ఎవరో ఒకరిని వారసుడిగా నియమిస్తే గుర్తించబోమని చైనా చెబుతోంది. దీంతో 17, 18 శతాబ్దాల్లో చైనాను పరిపాలించిన రాజుల కాలం నుంచి చౌద్ధ గుువుల వారసులకు పాలకుల ఆమోదం ఉండేది. టిబెట్ ప్రాచీనకాలం నుంచి చైనాలో అంతర్భాగమని చెబుతోంది.1959లో టిబెట్ ప్రజల తిరుగుబాటును చైనా అణచివేయగా 14న దలైలామాకు భారత్ ఆశ్రయమిచ్చింది. అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల కేంద్రంగా టిబెట్ ప్రవాస ప్రభుత్వం నడిపిస్తోంది. దలైలామాకు వయసు మీద పడడంతో గత రెండేళ్లుగా ఆయన వారసుడి కోసం అన్వేషిస్తున్నారు.