India- China: డ్రాగన్ దేశం చైనా సరిహద్దుల్లో కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 2020లో గాల్వాన్‌లో చోటుచేసుకున్న ఘర్షనలు, తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంబన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి పర్యటనపై గంటల తరబడి సస్పెన్స్ నెలకొంది. అసలు ఆయన వస్తారో.. లేదో..? అన్న సందేహం తలెత్తింది. చివరకు ఆయన భారత్‌కు వచ్చారు. కాగా ఆయన చైనా విదేశాంగ మంత్రి పర్యటన అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

నేడు (శుక్రవారం) ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో భేటీ కానున్నారు. పలు అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. గతంలో ఇస్లామాబాద్‌లో విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆగ్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ ఆపరేషన్‌లో జమ్మూకశ్మీర్‌పై వాంగ్‌యి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో చైనాకు భారత్ గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది.
Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !
జమ్ముకశ్మీర్ అనేది భారత్ అంతర్గత విషయమని, దీనిపై వ్యాఖ్యలు చేయడానికి చైనాకు ఎలాంటి హక్కు లేదని తేల్చిచెప్పింది. అలాగే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వాంగ్‌యికి సూచించింది. ఈ నేపథ్యంలో వాంగ్‌యి భారత్ పర్యటన, అజిత్ ధోవల్, జైశంకర్‌తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు దోహదపడతాయని, ఇందుకు వారి చర్చలు ఉపయోగపడతాయని సమాచారం. అయితే ఈ ఏడాది చివరలో బీజింగ్‌లో జరగబోయే బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోడీని ఆహ్వానించడానికే ఈ పర్యటన అని పలు జాతీయ మీడియాల్లో ఇప్పటికే కథనాలు ప్రచురితమైన విషయం విధితమే. మొత్తంగా భారత్‌లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన రెండు రోజుల పాటు ఉండనుంది.
Also Read: Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ సోమువీర్రాజు
Recommended Video: