అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నవంబర్ 3న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగనుంది. దీంతో డెమొక్రటిక్.. రిపబ్లిక్ పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. అమెరికన్లను ఆకట్టుకునేందుకు వీరిద్దరు ప్రయత్నాలు చేస్తున్నారు. పలు సంస్థలు అధ్యక్ష ఎన్నికల కోసం జరిపిన సర్వేలో ట్రంప్ కంటే జో బిడెన్ కే గెలుపు అవకాశాలున్నట్లు తేలింది. ఈ సర్వేలు రిజల్ట్ ఎలా ఉన్న ట్రంప్ మాత్రం ప్రచారంలో దూసుకెళుతున్నారు.
Also Read: అమెరికా అధ్యక్ష ఎన్నిక.. ఇండియన్ అమెరికన్లు ఎటువైపు?
తొలి నుంచి ట్రంప్ వ్యవహర శైలి చాలా భిన్నంగా ఉంటోంది. ప్రత్యర్థులపై నోరుపారేసుకోవడం ట్రంప్ కు కొత్తమేకాదు. ఇటీవల డెమొక్రటిక్ పార్టీ నుంచి అమెరికా ఉపాధ్యక్ష పదవీకి నామినేట్ అయినా కమలాహారిస్ పై తీవ్ర పదజాలంతో దూషించి వార్తల్లో నిలిచారు. తాను కూడా ఓ మహిళా అమెరికా ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నానని.. అయితే అది కమలహారిస్ కాదన్నారు. ఆమె కంటే తన కూతురు ఇవాంక ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయితే బాగుంటుందన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నా ఆయన మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళుతున్నారు. జో బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాలో నేరాలు.. ఘోరాలు దారుణంగా పెరిగిపోతాయని ఆరోపించారు. జో బిడెన్ హింసను ప్రేరిపించేలా పోలీసులకు వ్యతిరేకంగా ఓ ర్యాప్ సాంగ్ పాడినట్లు ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో జో బిడెన్ చిరునవ్వులు నవ్వుతూ చిన్నగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు.. అంతేకాదు.. ఈ ప్రజల్లో ఎవరైనా టాలెంట్ ఉన్నవారెవరయ్యా అంటే అది నేనే..! నేనే ప్రెసిడెంటుగా ఎన్నికవుతా అని ఆయన అన్నట్టు ఈ వీడియోలో కన్పిస్తోంది. ఈ వీడియోపై ట్రంప్ ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించాడు. దీనిని చూసి చైనా ‘ఓ.. భలే సంపడిపోతుంది’ అని కామెంట్ చేశాడు. అయితే ఈ ఫేక్ వీడియోగా తేలింది. జో బిడెన్ పోలీసులకు వ్యతిరేకంగా ఎలాంటి ర్యాప్ సాంగ్ పాడలేదని తెలుస్తోంది.
Also Read: సిరియా అధ్యక్షుడిని చంపిద్దామనుకున్న… ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
కొందరు కావాలనే ఈ ఫేక్ వీడియోను సర్య్యూలేట్ చేస్తున్నట్లు తేలింది. దీని వెనుక ట్రంప్ ఉన్నాడనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా ట్రంప్ రేసులో ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని అనుకుంటున్న ట్రంప్ ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే..!