KTR: ‘అదానీ మోదీ బినామీ.. లక్షల కోట్ల స్కాం చేస్తున్నారు. దోచుకుని దాచుకుంటున్నారు.. బీజేపీని బట్టలు విడిచి నగ్నంగా బజార్లో నిలబెడతాం.. బీజేపీ విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోంది. ఎన్నికలు ఉన్నందున బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తోంది’ గురువారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైనమంత్రి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివీ. గతంలో ఎన్నడూ చూడని ఆగ్రహం, ఆవేశం, అసహనం నిన్న కేటీఆర్‌లో కనిపించింది. ప్రెస్‌మీట్ సందర్భంగా ఆయన పక్కన కూర్చున్న మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తమ నేత మాటలు, వాడుతున్న భాష, ఆయన ముఖంలో ఆవేశం, ఆయనకు పడుతున్న చెమటలు చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఈ ఆవేశం బీజేపీ కన్నా.. బీఆర్‌ఎస్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుందంటున్నారు విశ్లేషకులు.
ఏం చెబితే అది వింటారన్న భావన..
బీఆర్‌ఎస్ అంటేనే కుటుంబ పాలన.. కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఈ విషయం తెలంగాణలో నిన్నగాక మొన్న లాగు తొడుక్కున్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. కానీ కల్వకుంట్ల కుటుంబం మాత్రం తెలంగాణ ప్రజానీకం తామ ఏం చెబితే అది వింటుందన్న భావనలో ఉంది. కానీ, తెలంగాణలో చైతన్యం ఎక్కువ, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఈ విషయం కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలియంది కాదు. కానీ వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజలు తమకు అధికారం ఇచ్చారు కాబట్టి తమనే విశ్వసిస్తున్నారు.. తాము ఏం చేసినా మౌనంగా ఉంటున్నారు. పథకాల రూపంలో తాము ఇచ్చే డబ్బులు తీసుకుని నోరు కిక్కురు మనడం లేదన్న ఆలోచన కల్వకుంట్ల కుటుంబానిది. కానీ విజ్ఞలైన ప్రజలు అదును చూసి దెబ్బకొడతారన్న విషయం చరిత్రను చూస్తే అర్థమవుతుంది.
ప్రభుత్వాలను కూల్చిందని ఆరోపణలు..
బీజేపీ తొమ్మిదేళ్లలో తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందని కేటీఆర్ ఆరోపించారు. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటక, మహారాష్ట్రలో విపక్షాలు కుట్రపూరితంగా ప్రభుత్వాలు ఏర్పాట చేశాయి. తర్వాత బీజేపీ వాటిని తిరిగి దక్కించుకుంది. దీనిని కల్వకుంట్ల ఫ్యామిలీ కూల్చివేతగా ప్రచారం చేస్తోంది. కానీ ప్రజలు ఈ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారు. తెలంగాణ విజయానికి వస్తే పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీఎస్పీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ఈ విషయం మరిచి కేటీఆర్ ప్రధానిపై చేస్తున్న వ్యాఖ్యలు జీడిగింజ సామెతలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మిమ్మల్ని మించిన అవినీతి ఎక్కడ…
ఇక అవినీతి గురించి కల్వకుంట్ల కుటుంబం మాట్లాడడమే పెద్ద జోక్. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో భూములన్నీ బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ నేతలు మింగేస్తున్నారు. ధరణి పోర్టల్ తెచ్చి పాత భూములను కూడా తమ పేరిట పట్టాలు చేసుకున్నారు. ఇది క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు, హైదరాబాద్‌లో భూముల అమ్మకం, అనుయాయులకు కట్టబెట్టడం ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తోంది. నాడు సొంత ఇల్లు లేదన్నవారికి ఫాంహౌస్‌లు, విల్లాలు, వందల ఎకరాల భూములు ఎక్కడి ఎలా వచ్చాయో ప్రజలకు అర్థమవుతుంది. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా కిందిస్థాయి నేతల నుంచి సీఎం వరకు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. ఇసుక, మట్టిని కూడా వదల కుండా చేస్తున్న వ్యాపారాలను మౌనంగా గమనిస్తున్నారు.
జీవోలను రహస్యంగా ఉచండం..
ఇక తమకు అనుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా ఇచ్చే జీవోలన ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కనిపించకుండా పెట్టడం ప్రజలకు తెలుసు. గుట్టుగా రాత్రికి రాత్రి ఇచ్చే జీవోలు ప్రజలకు, ఉద్యోగులకు అర్థమవుతుంది. రహస్య జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు.
వాళ్లు సుద్ధపూసలా..
తమ పార్టీ నేతలపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని కేటీఆర్ మొత్తుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నామా నాగేశ్వర్‌రావు, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పైలెట్‌రోహిత్‌రెడ్డి, తదితరులు ఏమన్నా సుద్ధపూజలా అన్న ప్రశ్న వస్తోంది. వారు వేల కోట్ల సంపాదిస్తూ పన్ను ఎగ్గొట్టిన విషయం తెలియంది కాదు. కానీ తమ పార్టీ వారు కాబట్టి వెనుకేసుకువస్తున్నారు.
కేంద్రం అనుమతి లేకుండా ఏ సంస్థ రాదు..
ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు వస్తున్నాయని పదే పదే చెబుతున్న కేటీఆర్ అవి ఎలా వస్తున్నాయో చెప్పడం లేదు. కేంద్రం అనుమతి ఇవ్వకుంటే ఒక్క సంస్థ కూడా తెలంగాణలో అడుగు పెట్టదు. అలా ఆంక్షలు విధిస్తే వివక్ష అనవచ్చు. కానీ కేంద్రం అనుమతితో సంస్థలు వస్తున్నా.. భారీగా పెట్టుబడులు పెడుతున్నా కేంద్రం వివక్ష చూపుతుందని ప్రచారం చేయడాన్ని సమాజం గమనిస్తోంది.
ఇలాంటి ఆవేశపూర్తి, అసంబద్ధమైన, టార్గెట్ రాజకీయాలు సొంత పార్టీ వారికి నచ్చుతాయి కావొచ్చు. తెలంగాణ సమాజానికి మాత్రం నచ్చవు. ఇన్నాళ్లూ బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్ వెంట ఉన్న ప్రజలు కూడా ఈ తీరుతో దూరమయ్యే అవకాశం ఉంది. ఆవేశపూరిత రాజకీయాలు కాకుండా ఆలచనాపూరిత రాజకీయాలు చేయాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని మాట్లాడితే అర్థవంతంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నేల విడిచి సాముచేస్తే మొదటికే మోసం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Cheating at first with counter attack ktr be careful
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com