Chaudhary Charan Singh: అవినీతి.. ఇందు కలదు అందు లేదు అనడానికి లేదు.. ఏ ప్రభుత్వ శాఖను వెతికినా అవినీతి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దొరికితేనే దొంగలు.. దొరకకుంటే దొరలు. ప్రజాధనంతో జీతాలు తీసుకుని ప్రజలకు సేవ చేయాల్సిన వారు.. డబ్బులు ఇవ్వనిదే పని చేయడం లేదు. ఇది నగ్న సత్యం. ఇక రెవెన్యూ, పోలీస్ శాఖలో అయితే అవినీతికి అడ్డే లేదు. రెవెన్యూ శాఖలో ఏ ఫైల్ కదలాలన్నా చేయి తడపాల్సిందే. ఇక పోలీస్ స్టేషన్లలో అయితే మరీ దారుణం ఫిర్యాదు తీసుకోవడానికి కూడా లంచం ఇవ్వాల్సిందే. అయితే ఇది చాలాకాలంగా వస్తుంది. స్వయంగా భారత మాజీ ప్రధాని చరణ్‌సింగ్ తాను బాధ్యతలు చేపట్టిన మొదట్లో స్వయంగా లంచావతారులను ఎదుర్కొన్నాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసులపై ఎక్కువ ఫిర్యాదులు..
భారత 5వ ప్రధానమంత్రి చరణ్ సింగ్ పోలీస్ స్టేషన్లలో అవినీతిపై ఆయనకు ఎక్కువగా పిర్యాదు వచ్చాయి. దీంతో ఆయన అసాధారణ వ్యూహాన్ని అమలు చేశారు. చెప్పులు లేకుండా, సాధారణ రైతు రూపంలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు చరణ్ సింగ్. ‘బంధువు ఇంటికి వెళ్తుండగా నాజేబులో డబ్బు దొంగిలించారు‘ అని ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వివరాలు అడిగి, కేసు నమోదు చేయడానికి ముందు లంచం డిమాండ్ చేశాడు. ఆయన అంగీకరించగానే కేసు ఫైల్ సిద్ధమైంది.
స్టాంప్ మ్యాజిక్..
సంతకం, వేలిముద్రలు అడిగిన కానిస్టేబుల్‌కు చరణ్ సింగ్ జేబులో ఉన్న పెన్ను–స్టాంప్ తీసి సంతకం చేశారు. ‘ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం‘ అని అధికారిక స్టాంప్ వేశారు. స్టేషన్‌లో అందరూ షాక్ అయ్యారు. దీంతో లంచం అడిగిన కానిస్టేబుల్‌తోపాటు మిగతా ఉద్యోగులంతా షాక్ అయ్యారు.
అందరూ సస్పెండ్..
స్టాంప్ చూడగానే చరణ్ సింగ్ అసలు గుర్తింపు బయటపెట్టారు. లంచం డిమాండ్ చేసిన కానిస్టేబుల్‌తో పాటు స్టేషన్‌లోని అందరినీ స్థానికంగా సస్పెండ్ చేశారు. ఈ చర్య పోలీస్ వ్యవస్థలో కంపిస్తుందిప్రధాని స్థాయి నుంచి స్థానిక అవినీతి బహిర్గతం. ఈ సంఘటన చరణ్ సింగ్ నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది:
ఇప్పటికీ లంచమే..
ఈ ఘటన 40 ఏళ్ల క్రితం జరిగినా, పోలీస్ స్టేషన్ల అవినీతి సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. డిజిటల్ ఫిర్యాదులు స్వీకరిస్తున్నా లంచం ఇచ్చాకే దర్యాప్తు మొదలవుతుంది. చరణ్ సింగ్ స్ఫూర్తితో ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ ఇలాంటి తనిఖీలు చేస్తే అవినీతికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.
View this post on Instagram