https://oktelugu.com/

కేంద్ర కేబినేట్ కమిటీలో మార్పులు

కేంద్ర కేబినేట్ విస్తరణలో భాగంగా ఇటీవల భారీ మార్పులు చేశారు. 43 మందితో కొత్త కేబినేట్ రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించారు. పాత మంత్రుల స్థానంలో కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ఇక నుంచి కొత్త మంత్రులు ఉప సంఘానికి పనిచేయనున్నారు. ప్రధాని నేతృత్వంలో ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉప సంఘంలో స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, గిరిరాజ్ సింగ్, వీరేంద్రకుమార్, శర్వానంద సోనోవాల్, అర్జున్ ముండా, మన్ సుఖ్ మాండవీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 13, 2021 / 02:09 PM IST
    Follow us on

    కేంద్ర కేబినేట్ విస్తరణలో భాగంగా ఇటీవల భారీ మార్పులు చేశారు. 43 మందితో కొత్త కేబినేట్ రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించారు. పాత మంత్రుల స్థానంలో కొత్త మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. ఇక నుంచి కొత్త మంత్రులు ఉప సంఘానికి పనిచేయనున్నారు. ప్రధాని నేతృత్వంలో ఉండే రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉప సంఘంలో స్మృతి ఇరానీ, భూపేంద్ర యాదవ్, గిరిరాజ్ సింగ్, వీరేంద్రకుమార్, శర్వానంద సోనోవాల్, అర్జున్ ముండా, మన్ సుఖ్ మాండవీయ నియామకమయ్యారు.

    దేశ భద్రతకు సంబంధించిన నిర్ణాయక వ్యవస్థ కేబినేట్ కమిటీలో ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ శాక మంత్రి జైశంకర్ సుబ్రహ్మణియన్ ఉన్నారు. ఈ కమిటీలో ఎలాంటి మార్పులేదు. అయితే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని ఉప సంఘంలో అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజులకు కొత్తగా అవకాశం వచ్చింది.

    నైపుణ్యాల వ్యవహారాల ఉపసంఘంలో తెలుగు మంత్రి కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఆయనతో పాటు ఆర్సీపీ సింగ్, అశ్వనీ చౌబే, భూపేంద్రయాదవ్ లను నియమించారు. ఇక జ్యోతిరాధిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, నారాయణ్ రాణేకు పెట్టుబడులకు సంబంధించిన కమిటీలో చోటు దక్కింది. కొత్తగా నియమాకమైన వారికి సీనియర్ మంత్రులు శుభాకాంక్షులు తెలిపారు.