https://oktelugu.com/

మంత్రి పదవి రెన్యువల్ కోసమే

ఏపీలో మంత్రుల పనితీరుపై ప్రక్షాళన ప్రారంభమైంది. సీఎం జగన్ రెండున్నరేళ్ల క్రితమే ఎక్కువ మందిని మార్చే అవకాశాలున్నాయని చెప్పడంతో ప్రస్తుతం అందరిలో మార్పు భయం పట్టుకుంది. ఇదే సందర్భంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేసే మంత్రులపై ఆయన మంత్రి పదవి రెన్యువల్ కోరుకుంటున్నారని ప్రతివిమర్శలు చేయడం గమనార్హం. దీంతో మంత్రుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎక్కడ తమ శాఖ పోతుందోననే బెంగతోనే ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురి పదవులే.. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మినహా 90 శాతం […]

Written By: , Updated On : May 8, 2021 / 02:09 PM IST
Follow us on

CM jaganఏపీలో మంత్రుల పనితీరుపై ప్రక్షాళన ప్రారంభమైంది. సీఎం జగన్ రెండున్నరేళ్ల క్రితమే ఎక్కువ మందిని మార్చే అవకాశాలున్నాయని చెప్పడంతో ప్రస్తుతం అందరిలో మార్పు భయం పట్టుకుంది. ఇదే సందర్భంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేసే మంత్రులపై ఆయన మంత్రి పదవి రెన్యువల్ కోరుకుంటున్నారని ప్రతివిమర్శలు చేయడం గమనార్హం. దీంతో మంత్రుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ఎక్కడ తమ శాఖ పోతుందోననే బెంగతోనే ఉన్నట్లు తెలుస్తోంది.

నలుగురి పదవులే..
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో నలుగురు మినహా 90 శాతం మందిని మార్చే అవకాశాలున్నాయి. మంత్రి మండలి ప్రమాణ స్వీకారం రోజే జగన్ ఇప్పుడున్న మంత్రులను మార్చడం ఖాయమని తేల్చారు. దీంతో మంత్రుల్లో పదవి భయం వెంటాడుతోంది. దీంతో కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య సైతం ఎక్కువగానే ఉంది.

త్వరలో మార్పులు
మంత్రివర్గంలో త్వరలో మార్పులు ఖాయమని తెలుస్తోంది. మంత్రుల పనితీరుపై ఇప్పటికే రిపోర్టులు రెడీ అయ్యాయని తెలిసింది. దీంతో మంత్రులకు పదవీ గండం పట్టుకుంది. ఈ నేపథ్యంలో జగన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులకు ఏ శాఖలు మారుతాయో ఎవరి శాఖలు సురక్షితంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఏపీలో మంత్రుల శాఖలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

మంత్రుల పనితీరే..
ఏపీలో మంత్రుల పనితీరుపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వారి వారి శాఖల పనితీరుపైనే ఫోకస్ పెడుతున్నారు. ప్రజల మధ్య ఎవరుంటున్నారు? ప్రజలకు దూరంగా ఎవరుంటున్నారని ఇప్పటికే సర్వేలు అందాయి. దీంతో సర్వేల ఆధారంగా మంత్రుల స్థానాలు మారిపోయే సూచనలున్నాయి. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ శాఖను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తమ భవితవ్యంపై మల్లగుల్లాలు పడుతున్నారు.