Chandrababu Naidu: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉంది. అయినప్పటికీ రాజకీయ క్షేత్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం నెలకొని ఉంది.ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే ప్రచార పర్వంలోకి దిగారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే ఏపీలో అధికార వైసీపీని గద్దె దించేందుకుగాను టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేందుకుగాను అధినేత చంద్రబాబు వ్యూహాలు రచించుకుంటున్నారు.
తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబుకు ఊహించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ టీడీపీ గెలవలేకపోయింది. అలా కుప్పం టీడీపీ కోట నుంచి జారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్న క్రమంలో చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు. ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: త్వరలోనే రంగంలోకి టీడీపీ వాలంటీర్లు.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్
చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో బాబు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. కుప్పం, శాంతిపురం, గుడిపల్లె, రామకుప్పం మండలాల్లో బాబు పర్యటన సాగనుంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో వైసీపీ నేతల దౌర్జన్యాల గురించి తెలుసుకుని వాటికి అడ్డుకట్ట వేసేందుకుగాను చర్యలు తీసుకోనున్నారు. ఇకపోతే కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్రసర్కారు నిధులు ఇవ్వకపోవడం గురించి బాబు ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలు కొందరు అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ రచ్చ కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ అంశాల పట్ల బాబు ఎలా స్పందిస్తారు.? నేతలను బుజ్జగిస్తారా? లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కుప్పంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఆదరణ తగ్గింది. దాంతో నియోజకవర్గంలో టీడీపీ పట్టు క్రమంగా సడలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు హవా చూపే ప్రయత్నం చూపిస్తున్నారు కూడా. దాంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు.
Also Read: కొత్త ఏడాదిలో ఏపీ రాజకీయం ఎలా మారనుంది..?