Chandrababu : చంద్రబాబు గారి ముందుచూపుకు సెటైర్లే సెటైర్లే పడుతున్నాయి. ఇప్పటికే 45 ఇయర్స్ పాలిటిక్స్.. 75 ఏళ్లు దాటిపోయాయి. మహా అయితే ఇంకో 5 ఏళ్లు యాక్టివ్ గా ఉండే పెద్దమనిషి ఇంకా మీ పిల్లల కోసం కష్టపడుతున్నా అంటే ఓకే అనుకోవచ్చు.. కానీ మీకు పుట్టబోయే పిల్లల కోసం కూడా కష్టపడుతున్నానంటూ అనడమే కాస్త ఎబ్బెట్టుగా ఉందయ్యా బాబూ అంటూ సెటైర్లు పడుతున్నాయి.
చంద్రబాబు ఈ మధ్యన మాట్లాడే మాటలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి. చేసే పనులు కూడా అపశకునం పాలవుతున్నాయి. చంద్రబాబు ఏది ముట్టుకున్నా.. పట్టుకున్నా పాపం కలిసి రావడం లేదు.. ఆయన కుమారుడి తీరు కూడా అంతే.. వారు ఎవరితో వెళ్లినా గత కొద్దికాలంగా వినాశనమే ఎదురవుతోంది. జగన్ ను ఓడించాలన్న కసి పట్టుదలతో దేవతలకు పూజలు చేసినా కూడా చంద్రబాబుకు ఆశించిన ఫలితం దక్కడం లేదు..
తాజాగా కుప్పంలో తన ప్రచార పర్వాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ముహూర్తం చూసుకొని కుప్పం నుంచి ప్రచారానికి బాబు గారు సిద్ధమయ్యారు. ఈ మేరకు శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద పూజారులతో కలిసి పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. అగరబత్తీలు ముట్టించారు. అనంతరం కర్పూరంతో హారతిని పూజరులు బాబుకు ఇవ్వగా.. ఆ దీపం కిందపడిపోయింది.. ఆరిపోయింది. దీంతో ఇదో అపశకునంగా పూజారులు కంగారుపడ్డారు. మన బాబు గారు మాత్రం యథాలాపంతో ఏదో మొక్కుబడిగా పూజలు ముగించారు.
తాజాగా కుప్పం సభలో చంద్రబాబు హామీలు కోటలు దాటిపోయాయి. ఏకంగా కుప్పంలో ఎయిర్ పోర్టు కట్టి.. ఇక్కడి కూరగాయాలను విదేశాలకు ఎగుమతి చేస్తానని ఇటీవల అన్నాడు. ఇప్పుడు ఏమో… మీ కోసం కాదు మీకు పుట్టబోయే పిల్లల కోసం కష్టపడుతున్నానంటూ అలివికాని మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడడం వల్లనే ట్రోలర్స్ కు చిక్కి పాపం బాబు విలవిలలాడుతున్నాడు. ఇప్పటికైనా క్లారిటీతో కాస్త చూసుకొని మాట్లాడితే బెటర్ అని అందరూ సలహాలిస్తున్నారు.
ఇంకానయం.. పిల్లల్ని పుట్టించటానికి కష్టపడుతున్నా అనలేదు.. pic.twitter.com/xZASN9F9Uy
— Inturi Ravi Kiran (@InturiKiran7) December 30, 2023