
ఆంధ్రపదేశ్‌లో ఎన్నికలు జరిగిన ఏడాదిన్నర కూడా కావడం లేదు. జగన్ అధికారం చేపట్టి 16 నెలలే గడుస్తోంది. కానీ.. అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎన్నికల కోసం ఉవ్విల్లూరుతున్నారు. మళ్లీ ఎప్పుడెప్పుడు అధికారం చేతికి వస్తుందా అంటూ తహతహలాడుతున్నారు. 2019 ఎన్నికల్లోనే కోలుకోలేని దెబ్బతిన్న బాబు.. ఇప్పుడు ఎన్ని సీట్లు సాధిస్తాడో ఆయనకే తెలియదు. గెలుచుకున్న 23 మంది ఎమ్మెల్యేల నుంచి ఒక్కొక్కరుగా వైసీపీ బాట పడుతూనే ఉన్నారు. వారినే కాపాడుకోలేని చంద్రబాబు.. ఏకంగా సీఎం సీటు కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా.. కొత్త రాగం ఎత్తుకున్నారు.
Also Read: కేసీఆర్ తో ఫైట్ కు రెడీ అయిన జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొత్తగా ఓ బాంబు పేల్చారు. 2022లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. 2022లో జమిలీ ఎన్నికలు వస్తే అందరూ సిద్ధంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమలాపురం పార్లమెంట్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జగన్ చేతగాని పాలనతో చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. పులివెందుల రాజ్యాంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా జగన్ అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులపైనే జగన్ వర్గం ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తోందన్నారు. కేసుల మాఫీ కోసం జగన్ కేంద్రం కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడగకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు.
Also Read: నేడు చప్పట్లు కొట్టనున్న జగన్.. ఎందుకంటే?
అలాగే అమరావతిలో రూ.లక్ష కోట్ల విలువైన సంపదను సీఎం జగన్ విధ్వంసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్ పెడితే.. జగన్ కుట్ర పూరితంగా బీసీల్లో చీలిక తెచ్చారన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వబోమని జగన్ చెబుతున్నారని మండిపడ్డారు. 2022లోనే జమిలీ ఎన్నికలు వచ్చే చాన్స్ ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ఇప్పుడు తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి భవిష్యత్‌లో గుణపాఠం చెబుతామని చంద్రబాబు హెచ్చరించారు. మరి చంద్రబాబు తాపత్రయ పడుతున్నట్లు జమిలీ ఎన్నికలు వస్తాయా..? బాబు చెబుతున్నట్లు జగన్ మీద వ్యతిరేకత వీళ్లు నిరూపించగలరు..? ఏం జరుగుతుందో చూడాలి మరి.
Comments are closed.