Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu- Jagan: మోడీనే బూచీ.. జగన్ ను కొట్టే చంద్రబాబు ప్లాన్

Chandrababu- Jagan: మోడీనే బూచీ.. జగన్ ను కొట్టే చంద్రబాబు ప్లాన్

Chandrababu- Jagan: గత ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయం నుంచి చంద్రబాబు చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. వైసీపీ ట్రాప్ లో పడి ఎన్టీఏకు దూరం కావడం, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టడంలో వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్నారు. రాజకీయంగా దెబ్బతిన్నారు. అందుకే వచ్చే ఎన్నికలకు పక్కా ప్లాన్ తో వెళుతున్నారు. నాడు విపక్ష నేత జగన్ అనుసరించిన వ్యూహాలనే తానూ అమలు చేస్తున్నారు. అటు మధ్యలో ప్రధాని మోదీ ప్రస్తావన తెచ్చి…మీరే తేల్చుకోవాలని ప్రజలను సూచిస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా ఉన్న జగన్ టీడీపీ ప్రభుత్వంతో పాటు చంద్రబాబును ఎంత డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు. అయితే ప్రధానంగా ఒకే సామాజికవర్గానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నరన్న ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడదే ప్రచారంతో జగన్ ను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారు. తాజాగా కొన్ని నియామకాలను తెరపైకి తెచ్చి విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేశానని.. తననెవరూ టచ్ చేయలేరని కూడా కామెంట్స్: చేశారు. ఈ ఎన్నికలు తనకు చివరివి కాదని..మరోసారి వైసీపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు చివరి ఎన్నికలంటూ కొత్త స్లోగన్ మొదలు పెట్టారు.

Chandrababu- Jagan
Chandrababu- Jagan

2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం పోలీస్ శాఖలో పదోన్నతులు కల్పించింది. అయితే నాడు చంద్రబాబు సొంత సామాజికవర్గం ఆఫీసర్స్ కే ప్రయారిటీ ఇచ్చారని జగన్ అండ్ కో ఊరూవాడ ప్రచారంతో హోరెత్తించింది. పీకే టీమ్ కూడా సోషల్ మీడియాలో దీనిని హైప్ చేసింది. దీంతో రాష్ట్రంలో మెజార్టీ వర్గాలు నిజమేనని నమ్మాయి. ఫలితంగా వైసీపీ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది. పొలిటికల్ గా గెయిన్ అయ్యారు. కానీ అది తప్పు అని ఎలక్షన్ తరువాత బయటపడింది. సాక్షాత్ వైసీపీకి చెందిన హోంమంత్రే అసెంబ్లీలో నాడు పదోన్నతుల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని ప్రకటించారు. నాడువిపక్ష వైసీపీ ప్రచారాన్ని టీడీపీ తిప్పికొట్టలేకపోయింది. దానికి మూల్యం చెల్లించుకుంది.

అయితే నాడు వైసీపీ కొట్టిన దెబ్బను చంద్రబాబు గుర్తించుకున్నట్టున్నారు. సేమ్ సీన్ రిపీట్ చేసేందుకు యత్నిస్తున్నారు. తాజాగా ఏలూరులో పర్యటించిన చంద్రబాబు.. రాష్ట్రానికి సీఎం, ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ..ఇలా అందరూ ఒకే జిల్లా.. ఒకే సామాజికవర్గం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మౌనంగా ఉంటే లాభం లేదని.. తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పనిలో పనిగా అధికార పక్షం తాజాగా చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తానని ప్రచారం చేస్తున్నారని.. దానిలో ఏ మాత్రం నిజం లేదన్నారు. పరోక్షంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. జగన్ సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టారు. లబ్ధిదారులే తనను గెలిపిస్తారని నమ్ముతున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఆలోచనతో ముందుకెళుతున్నారు.

Chandrababu- Jagan
Chandrababu- Jagan

ప్రధాని మోదీ తనను మెచ్చుకున్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేస్తున్నారు. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా మహిళలు ఇలా అన్నింటిపై ప్రసంశించారని.. రూ.1.80 లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వలేని జగన్ తో, తనకు పోలిక ఏమిటని,, మా ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో మీరే చెప్పాలని ప్రజలను కోరుతున్నారు. జగన్ చేసిన తప్పులతో.. ఒక్కో మనిషిపై రూ.2.70 లక్షల అప్పు ఉందని.. పోరాడితే ప్రజలదే విజయమని..పిరికితనంతో బానిసత్వం తప్పదని హెచ్చరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో సమరశంఖం పూరించాలని ప్రజలకు నేరుగా పిలుపునిచ్చారు. తనకివే చివరి ఎన్నికల కామెంట్ ను సవరించుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట చంద్రబాబు
లాస్ట్ చాన్స్ అని.. ఒక్క అవకాశమివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు లాస్ట్ చాన్స్ అయితే ప్రజలకు నష్టమేమిటని వైసీపీ ఎదురుదాడి చేసింది. అటు బీజేపీ లైట్ తీసుకుంది. దీంతో తన మాటలను సవరించుకున్నారు. లాస్ట్ చాన్స్ అన్న మాట రాష్ట్ర ప్రజానీకంపై వేశారు. 2019 ఎన్నికల్లో తాను ఇదే మాటను చెప్పానని.. మీరు వినలేదని.. మరోసారి తప్పు చేయవద్దంటూ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడ్డారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular