
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 2019 ఎన్నికల ఫలితాలతో ఆశలన్నీ అడియాశలయ్యాయి. జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ తెలంగాణలో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో తెలంగాణ అంత దారుణమైన స్థితిలో టీడీపీ లేకపోయినా రోజురోజుకు బలహీనపడుతోందనే మాట వాస్తవం. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ జనసేన మద్దతు ఇవ్వకపోతే అప్పుడే టీడీపీ ఓటమిపాలయ్యేది.
Also Read : అమరావతి భూకుంభకోణం కేసులో ఏసీబీ దూకుడు… ఆ ఎమ్మెల్యేలకు షాక్….?
అయితే నాలుగేళ్ల పాటు బీజేపీతో సన్నిహితంగా మెలిగిన చంద్రబాబు చివరి ఏడాది మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ తరువాత బీజేపీతో స్నేహపూర్వకంగా మెలగడానికి చంద్రబాబు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే తాజాగా చంద్రబాబు ఫోన్ కాల్ ను అమిత్ షా లిఫ్ట్ చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.
అమిత్ షా కాల్ లిఫ్ట్ చేయడం వల్ల 2020 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తమతో పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ భావిస్తోంది. అయితే బాబు ఫోన్ చేయడానికి కూడా ముఖ్యమైన కారణమే ఉంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్న అమిత్ షా శ్వాస సంబంధిత సమస్యలు తిరగబెట్టడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. దీంతో చంద్రబాబు పరామర్శ కోసం అమిత్ షాకు కాల్ చేయగా ఆయన లిఫ్ట్ చేసి మాట్లాడారు.
దీంతో చంద్రబాబుకు, టీడీపీ అనుకూల మీడియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఫోన్ లిఫ్ట్ చేసినంత మాత్రాన బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనుకోవడం అత్యాశే అవుతుంది. బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తూ ఉండటంతో 2024 ఎన్నికల్లో కూడా వైసీపీనే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండటంలో 2024లోనూ ప్రజలు నమ్మకపోతే టీడీపీ పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : మరణించినా ‘కోడెల’ను వదలవా జగన్?