Chandrababu: ఇటీవల చంద్రబాబు నోటి నుంచి తరచూ ఒక మాట వినిపిస్తోంది. పార్టీలో ఎగువ, మధ్యశ్రేణి నాయకత్వం బద్దకం వీడాలని అధినేత ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. లేకుంటే తప్పుకోవాలని అల్టిమేటం జారీచేస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా అధినేత నుంచి హెచ్చరికలు వస్తుండడంతో నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో భీకర యుద్ధం నడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార వైసీపీతో హోరాహోరీగా తలపడేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సన్నాహాలు ప్రారంభించాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడతాయని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి తుది రూపం వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. అయితే ఇంతలో ఎవరికి వారు వారి పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఒక వేళ కూటమి కడితే మాత్రం టీడీపీ నాయకులే ఎక్కువగా త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు ఎక్కడా పొత్తుల ప్రస్తావన తేకుండానే ముందుగా పార్టీలో పనిచేయని నాయకులను గుర్తించే పనిలో పడ్డారు. ఎక్కడ నాయకులు పనిచేయడం లేదో వివరాలను తెప్పించుకుంటున్నారు, ముందుగా వృద్ద జంబుకాలను పక్కకు తెప్పించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది.

ముగ్గురు సీనియర్లకు చెక్..
ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి గౌతు శ్యామసుందర శివాజీ, కిమిడి కళా వెంకటరావు, పతివాడ నారాయణస్వామినాయుడుల కుటుంబాలను పక్కన పెట్టడానికి చంద్రబాబు దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఈ ముగ్గురు వెనుకబడిన తరగతులకు చెందిన వారు. గౌతు శివాజీ సర్దారు గౌతు లచ్చన్న తనయుడు. సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ వయోభారం కారణంగా ఆయన్ను తప్పించి కుమార్తె గౌతు శిరీషకు ఇప్పటికే పలాస ఇన్ చార్జిగా నియమించారు. అయితే యువ మంత్రి అప్పలరాజుపై ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదని.. ఆమెను తప్పిస్తారని ప్రచారం నడుస్తోంది. కళా వెంకటరావు కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అధినేతకు రిపోర్టు అందినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కళా తన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును ఎచ్చెర్ల నుంచి పోటీ చేయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. పతివాడ నారాయణస్వామి నాయుడు అత్యంత సీనియర్. ప్రస్తుతం నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నారు. అయితే ఆయన వయోభారంతో బాధపడుతుండడంతో తన కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రత్యామ్నాయ నేతను రంగంలో దించనున్నట్టు తెలుస్తోంది.
Also Read: AP Politics- Media: మీడియా ఎంత గొంతుచించుకున్నా ఎవరిని గెలిపించాలో ఏపీ జనాలు ఫిక్స్ అయిపోయారట?
పట్టుకు ప్రయత్నం..
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో టీడీపీకి పట్టు తక్కువ. పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందిన సందర్భాలు లేవు. అందుకే ఈ సారి కొత్త తరహా ప్రయోగాలకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. యువకులను ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నుంచి కొత్తగా గిరిజన వర్గానికి చెందిన సామాజిక వేత్త పడాల భూదేవిని పోటీలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు కురుపాం నుంచి శత్రుచర్ల విజయరామరాజు, కిశోర్ చంద్రదేవ్ సిఫారసులతో కొత్తవారిని బరిలో దింపేందుకు యోచిస్తున్నారు.

సాలూరు నుంచి డిప్యూటీ సీఎం రాజన్నదొరను ఢీకొట్టేందుకు గుమ్మిడి సంధ్యారాణిని బరిలో దించనున్నారు. పాడేరు, అరకు నియోజకవర్గాలను సైతం ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు. ఎస్సీ రిజర్వు స్థానాలకు సంబంధించి కూడా విజయం సాధించాలని గట్టి ప్రయత్నంతోనే ఉన్నారు. రాజాం నుంచి కోండ్రు మురళీమోహన్ కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు పార్వతీపురం నుంచి బొబ్బిలి చిరంజీవులకు మరోసారి అవకాశం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే దాదాపు ఆరు పదులు దాటిన నాయకులకు పక్కకు తప్పించేందుకు సిద్ధపడుతున్నారు. వారి కుటుంబసభ్యులకో..లేకుంటే వారి సిఫారసు చేసిన నేతలకో టిక్కెట్లు కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారు. అయితే దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న వారికి మాత్రం అధినేత నిర్ణయం మింగుడుపడడం లేదు.
Also Read:Karnataka Husband and Wife: ఒక మహిళ కోసం ఇద్దరు భర్తల ఆరాటం..ఎందుకు కొట్టుకు చస్తున్నారంటే?


[…] Also Read: Chandrababu: రిజర్వుడ్ స్థానాలపై చంద్రబాబు ఫ… […]