Chandrababu Naidu: చంద్రబాబు రూటు మార్చారు. తన మాట తీరును, హావభావాలను మార్చుకున్నారు. ప్రసంగాలను మరింత పదునెక్కిస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తున్నారు. సుదీర్ఘ వ్యాఖ్యలు లేకుండా తాను అనుకున్నది, ప్రజలకు అర్థమయ్యేలా సుతి మొత్తగా, సుత్తి లేకుండా మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై తూటాలను పేల్చుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడులో చంద్రబాబు పాల్గొన్నారు. అధికార పార్టీపై, ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవలికాలంలో చంద్రబాబు డైలాగులు బాగా పేలుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్నా ఎక్కువగా పంచ్‌లు వేస్తున్నారని, ఆయన్ను మించి మాటల రచయిత అయ్యారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి టీడీపీకి స్టార్ కేంపయినర్ చంద్రబాబే. ఏడు పదుల వయసు దాటినా ఆయన ఆహారం, శారీరక క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారు. అందుకే ఆరోగ్యంగా ఉంటారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎక్కువసేపు ప్రజల మధ్య గడిపేందుకు నిర్ణయించారు. తన ప్రసంగ శైలిని కూడా మార్చుకున్నారు. గతంలో మాదిరిగా సుదీర్ఘ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు లేకుండా చూసుకుంటున్నారు. యువతను టార్గెట్ చేసుకొని.. వారిని ఆకట్టుకునేలా మాట్లాడుతున్నారు. పంచ్ డైలాగులు విసురుతూ వారిలో ఆలోచనను రేకెత్తిస్తున్నారు. చోడవరం సభలో ఆయన విసిరిన పంచ్ డైలాగులను ఒక సారి పరిశీలిద్దాం.
Also Read: Ram Gopal Varma Konda Movie: కొండా మురళి-సురేఖ చరిత్ర ఇదీ.. ఆర్జీవీ తన సినిమాలో ఏం చూపిస్తాడు?
ఒక రెడ్డి పోతుంటే మరో రెడ్డి వస్తారు. ఇదేనా సామాజిక న్యాయమంటూ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి స్థానంలో వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. అందులో సామాజిక న్యాయమెక్కడదని నిలదీశారు. రాష్ట్రంలో నవరత్నాల మాట దేవుడెరుగు.. నవఘోరాలు మాత్రం జరిగాయంటూ ఉదహరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు భూములు దోచుకుంటున్నారు.. అవినీతికి పాల్పడుతున్నారు. వాటికంటే ఘోరాలు, నేరాలు ఏముంటాయని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు.. అదే అభివ్రుద్ధిలో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై బొబ్బిలిపులిలా దూసుకుపోతాం.. కొండవీటి సింహంలా గర్జిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. రోడ్లు ఎంతో అందంగా ఉన్నాయో.. కిలోమీటరుకు 150 గుంతలున్నాయి. నడుములు విరిగిపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు.
గుంతల్లో మట్టిపోయని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంట సట్టైర్ వేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో పంట విరామం ప్రకటించారంటే మీ ప్రభుత్వానికి సిగ్గుందా? అంటూ నేరుగా ప్రశ్నించారు. రూ.50వేలతో ఐటీ ఉద్యోగాలిస్తే.. రూ.5వేలతో వలంటీరు పోస్టు ఇచ్చారు అంటూ పాలనా వైఫల్యాన్ని గుర్తుచేశారు. నాకు శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలూ లేవు 11. ఉదయం 6.00 గంటలకు ఎంత కూల్ గా ఉంటానో.. రాత్రి 10.00 గంటలకు కూడా అంతే కూల్ గా ఉంటాను అంటూ నాకు వయసైపోయిందన్న అధికార పక్ష నేతల మాటలకు ధీటుగా జవాబిచ్చారు. హత్య చేసిన ఎమ్మెల్సీ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారంటే నేరాన్ని ఎలా సమర్థిస్తున్నారు. ఆ నేరాన్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారో అర్ధమవుతోందని చంద్రబాబు ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పారు. గత కొన్ని నెలలుగా చంద్రబాబు ప్రసంగాలను గమనిస్తే వాడీ వేడీ పెరిగిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
Also Read:Union Minister Shobha Karandlaje: ఏపీ ఆదాయం విదేశాలకు తరలిపోతోందా? అసలేంటి కథ?