https://oktelugu.com/

చంద్రబాబు వర్సెస్ జగన్.. ప్రతీకారం.. ఉప్పుకారం!

ఏపీలో రాజకీయం ఇప్పుడు రెండు పార్టీల మధ్యే నడుస్తుందా..? అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని వేధిస్తోందని అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ అంటోంది. పాత విషయాలను పక్కనబెడితే ఇప్పుడు ప్రభుత్వం అక్రమాస్తులు కలిగి ఉన్నారని పలువురు టీడీపీ నాయకులకు చెందిన భవనాలు కూలుస్తుందని కొందరు అంటున్నారు. అయితే అక్రమాస్తులు కలిగి ఉన్నవారెవరైనా సరే కూల్చేస్తామని ప్రభుత్వం అంటోంది. అయితే ఈ పని వైసీపీ మాత్రమే చేస్తుందా..? టీడీపీ చేయలేదా..? అంటూ కొందరు […]

Written By: , Updated On : April 26, 2021 / 03:49 PM IST
Follow us on

Vizag Steel Plant Issue

ఏపీలో రాజకీయం ఇప్పుడు రెండు పార్టీల మధ్యే నడుస్తుందా..? అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని వేధిస్తోందని అప్పుడు వైసీపీ, ఇప్పుడు టీడీపీ అంటోంది. పాత విషయాలను పక్కనబెడితే ఇప్పుడు ప్రభుత్వం అక్రమాస్తులు కలిగి ఉన్నారని పలువురు టీడీపీ నాయకులకు చెందిన భవనాలు కూలుస్తుందని కొందరు అంటున్నారు. అయితే అక్రమాస్తులు కలిగి ఉన్నవారెవరైనా సరే కూల్చేస్తామని ప్రభుత్వం అంటోంది. అయితే ఈ పని వైసీపీ మాత్రమే చేస్తుందా..? టీడీపీ చేయలేదా..? అంటూ కొందరు వాదిస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో ప్రత్యేకంగా పనిచేస్తున్న ఏసీబీ, సీబీఐలో జగన్ జేబు సంస్థలు అని మాజీ మంత్రి అయ్యన్న పాత్రడు ఆరోపిస్తున్నాడు. అవి ప్రజల పక్షాన పనిచేయాలని అంటున్నారు. అయితే ఏసీబీ, సీబీఐలు ప్రభుత్వ పోలీసులను ఉపయోగించుకొనే గదా పనిచేస్తాయని వైసీపీ నాయకులు సమాధానం ఇస్తున్నారు. చంద్రబాబు కూడా మాకు ఏసీబీ ఉంది. అప్పట్లో గట్టిగా వాదించలేదా..? అని వారు గుర్తు చేస్తున్నారు. ఏసీబీ మాటున ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని వైసీపీ నాయకులు అంటున్నారు.

విశాఖలో గత కొంతకాలంగా అక్రమాస్తులను ప్రభుత్వ కూల్చివేస్తోంది. గీతం యూనివర్సిటీ నుంచి సబ్బం హరికి చెందిన ఆస్తులను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే టీడీపీకి చెందిన నాయకులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని అంటున్నారు. అయితే ఇలా కూల్చివేసిన భవనాల్లో వైసీపీ నేతలవి కూడా ఉన్నవన్న విషయం వారు చెప్పరు. ఎందుకంటే వారికి ప్రజల నుంచి సానుభూతి కావాలి కదా అని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

విశాఖలో డైరీ అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ కు చెందిన నాయకులు అంటున్నారు. అయితే మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలని వైసీపీ నాయకులు అడుగుతున్నారు. మరి దానికి వారి సమాధానం ఎలాగుంటుందో..? ఏ ప్రభుత్వం అయితే ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటుంది. దానిని ఎలా అనుకున్నా పర్వాలేదు గానీ.. అయితే ప్రజల నుంచి సానుభూతి రాబట్టుకోవాలనుకోవడం మాత్రం ఆశ్చర్యమేంటున్నారు రాజకీయ విశ్లేషకులు.