Jagan-Chandrababu: రాజకీయాల్లో గండర గండుడు అయిన చంద్రబాబు ఏ విషయంలో అయినా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిదంటే మాత్రం.. ఎంతో అర్థం ఉన్నట్టే లెక్క. ఎంతటి ఒత్తిడిలో అయినా సరే ఆయన నోరు జారరు. అదే ఆయన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చింది. సుదీర్ఘ భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆయన నినాదాలు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు మరో ప్రయోగం చేశారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఏపీకి ఎంతటి అన్యాయం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీకి హక్కుగా రావాల్సినవి కూడా ప్రకటించలేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విభజన హామీల్లో ఒక్కటి కూడా కనిపించకపోవడం అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. చాలా కాలంగా కేంద్రం నిర్ణయాల మీద సైలెంట్ గా ఉంటున్నారు.
ఏ విషయంలో అయినా కేంద్రానికి ఇన్ డైరెక్టుగా మద్దతు ఇస్తున్నట్టే వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మధ్య తొలిసారి ఆయన కేంద్రాన్ని విమర్శించారు. బడ్జెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదంటూ మండిపడ్డారు. కేంద్రాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీలు ఏ మాత్రం స్పందిచకుండా.. పోరాడకుండా ఉండటాన్ని తప్పుబట్టారు. దీన్నంతా చూస్తుంటే గతంలో జగన్ అనుసరించిన వ్యూహాన్నే చంద్రబాబు అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.
Also Read: ఏపీకి రాజధాని అదే అంట.. జగన్ కు షాక్ ఇచ్చిన కేంద్రం..!
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేంద్రాన్ని ఏమీ ప్రశ్నించలేదు. దీంతో జగన్ దాన్ని ఆసరాగా చేసుకుని కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడి ప్రజల దగ్గర మార్కులు కొట్టేశారు. కాగా ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. జగన్ బడ్జెట్ మీద సైలెంట్ గా ఉండటంతో.. ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు చంద్రబాబు. రాష్ట్రానికి ఇంతమంది ఎంపీలు ఉండి ఏం సాధించారంటూ తీవ్రంగా విమర్శించారు.
మొత్తానికి జగన్ సర్కార్‌ను ఆత్మ రక్షణలో పడేశారు చంద్రబాబు. ఇప్పుడు కేంద్రాన్ని జగన్ నేరుగా విమర్శించే పరిస్థితులు లేవు. కాబట్టి ఆ క్రెడిట్‌ను కొట్టేసే పనిలో పడ్డారు చంద్రబాబు. జనసేన కూడా నిలదీయట్లేదు. కాబట్టి రాష్ట్రం తరఫున పోరాడేది తమ పార్టీనే అని చెప్పుకునే పరిస్థితులనున తీసుకొస్తున్నారు.
Also Read: ఏపీలో సిమెంట్ కంపెనీలపై సర్కారుకెందుకింత పక్షపాతం?