మూడేళ్లకు ముందే బాబు ఢిల్లీకి..

ఏపీలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందడంతో చంద్రబాబు నిరాశతో ఉన్నాడు. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికపై కూడా పెద్దగా ఆశలు లేదు. దీంతో ఇక మధ్యలో వచ్చే ఎన్నికలపై కాకుండా మూడేళ్ల తరువాత వచ్చేచ సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎన్నికల్లో ఎలాగైనాగ గెలువాలన్న ఉద్దేశంతో బాబు కొత్త యత్నాలు మొదలు పెట్టారట. ఇప్పటికే తనతో ఉన్న మిత్రులతో కలిసి ఏం చేద్దామన్న ఆలోచనలతో సమావేశం నిర్వహించాడట. అయితే […]

Written By: NARESH, Updated On : April 27, 2021 11:39 am
Follow us on

ఏపీలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందడంతో చంద్రబాబు నిరాశతో ఉన్నాడు. త్వరలో జరిగే తిరుపతి ఉప ఎన్నికపై కూడా పెద్దగా ఆశలు లేదు. దీంతో ఇక మధ్యలో వచ్చే ఎన్నికలపై కాకుండా మూడేళ్ల తరువాత వచ్చేచ సార్వత్రిక ఎన్నికలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఎన్నికల్లో ఎలాగైనాగ గెలువాలన్న ఉద్దేశంతో బాబు కొత్త యత్నాలు మొదలు పెట్టారట. ఇప్పటికే తనతో ఉన్న మిత్రులతో కలిసి ఏం చేద్దామన్న ఆలోచనలతో సమావేశం నిర్వహించాడట. అయితే ఇటీవల బాబు ఢిల్లీ టూర్ కు పయనమవుతున్నట్లు సమాచారం. ఎందుకంటే..?

మూడేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంలో బాబు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిరానున్నట్లు సమాచారం. 2014కు ముందు బీజేపీతో సయోధ్యతో ఉండడంతో ఆ తరువాత అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అయితే మధ్యలో బీజేపీతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొన 2019లో బరిలోకి దిగారు. దీంతో ఆ ఎన్నికలు బెడిసి కొట్టిన విషయం తెలిసిందే.

ఇక అప్పటి నుంచి బాబుకు కలిసి రావడం లేదు. దీంతో మరోసారి బీజేపీతో కలిసి వెళ్తేనే బాగుంటుందన్న ఆలోచనలో పడ్డారట. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత తన పాత పరిచయం ఉన్న ఆర్ ఎస్ ఎస్ మిత్రులతో కలిసి కేంద్రం పెద్దలను కలిచేందుకు ప్లాన్ వేశాడట. అయితే అప్పటి వరకు ఆగకుండా ముందే వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడట. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి రాష్ట్రంలో పోటీ చేయాలని నిర్ణయించాడట. అధికారం కోసం కొన్ని సీట్లను ఇతర పార్టీలకు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట.

ఇక దాదాపు రెండేళ్ల తరువాత బాబు ఢిల్లీ వెళుతున్నారు. 2019 ఎన్నికల ముందు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే సమయంలో రాహుల్ గాంధీని కలిశారు. ఆ తరువాత మళ్లీ ఢిల్లీ వెళ్లలేదు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే కేంద్ర పెద్దలను కలిసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మరి బాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? లేక బెడిసికొడుతుందా..? వెయిట్ అండి సీ..