Chandrababu: లిక్కర్ స్కాం కేసులో చంద్రబాబు సేఫ్?

టిడిపి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా మద్యం వ్యవహారాలు నడిపినట్లు సిఐడి వాదిస్తోంది. తన హయాంలో చంద్రబాబు కావలసిన కంపెనీలకు దోచి పెట్టారని ఆరోపిస్తోంది.

Written By: Dharma, Updated On : November 19, 2023 12:41 pm

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబుపై లిక్కర్ స్కాంలో పట్టు బిగించేందుకు వైసిపి సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బయలు పై ఉన్నారు. ఒకవేళ ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించినా.. లిక్కర్ స్కామ్ లో పట్టు బిగించాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది.

టిడిపి ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా మద్యం వ్యవహారాలు నడిపినట్లు సిఐడి వాదిస్తోంది. తన హయాంలో చంద్రబాబు కావలసిన కంపెనీలకు దోచి పెట్టారని ఆరోపిస్తోంది. కావలసిన డిస్టలరీలకు అడ్డగోలుగా అనుమతులు, క్విడ్ ప్రోలో భాగంగా ఎక్సైజ్ పాలసీనే మార్చేసిన వైనం, రెండు బేవరేజ్ లతో పాటు మూడు డిస్టలరీలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు వంటి వాటిని సిఐడి ప్రస్తావిస్తోంది. ఈ కేసులో ఏ1 గా ఐఏఎస్ నరేష్, ఏ2గా కొల్లు రవీంద్ర, ఏ3గా చంద్రబాబును చూపడం విశేషం.

అయితే ఈ కేసులో తనపై ఆధారాలు లేవని .. కేసు కొట్టివేయాలని చంద్రబాబు కోరుతూ వచ్చారు. ఇప్పటికే స్కిల్ స్కాం కేసునకు సంబంధించి 17 ఏ సెక్షన్ పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో సైతం నిబంధనలు పాటించలేదని..దీనికి సైతం 17a సెక్షన్ వర్తించే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయకుండా చంద్రబాబును బాధ్యులు ఎలా చేస్తారని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ తరుణంలో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 20 కి వాయిదా వేశారు. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ ఉండడం.. అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ గడువు పెంచాలని కోరడం.. తదితర కారణాలతో లిక్కర్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చంద్రబాబు బెయిల్లో ఉండడం.. లిక్కర్ స్కాం కేసులో సరైన ఆధారాలు చూపకపోవడంతో ఆయన సేఫ్ జోన్ లోనే ఉంటారని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. కానీ సిఐడి దూకుడు చూస్తుంటే….ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుపై పట్టు బిగించాలని చూస్తుండడం విశేషం.