https://oktelugu.com/

టీడీపీ వస్తే రైతుకు రూ. 1.15 లక్షలు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న వైయస్సార్ రైతు భరోసా స్కీమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ వట్టి బోగస్ స్కీమ్ అని అన్నారు. చంద్రబాబు నిన్న టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీనియర్ నేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు కూడా పాల్గొన్నారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 28, 2020 / 08:31 AM IST
    Follow us on


    మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న వైయస్సార్ రైతు భరోసా స్కీమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న ఈ స్కీమ్ వట్టి బోగస్ స్కీమ్ అని అన్నారు. చంద్రబాబు నిన్న టీడీపీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీనియర్ నేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలు కూడా పాల్గొన్నారు.

    సీఎం జగన్ రాష్ట్రంలోని ఒక్కో రైతుకు 77,500 రూపాయలు ఎగ్గొట్టారని వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతు భరోసా స్కీమ్ ద్వారా రైతులకు 37,500 రూపాయలు మాత్రమే ఇస్తుందని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రుణమాఫీ స్కీమ్ ను అమలు చేసిందని ఈ స్కీమ్ తో పాటు అన్నదాత సుఖీభవ పేరుతో మరో స్కీమ్ ను అమలు చేసిందని టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ స్కీమ్ ల ద్వారా ఒక్కో రైతుకు 1,15,000 రూపాయలు ఇచ్చేదని అన్నారు.

    జగన్ రైతులకు 77 వేల రూపాయలు ఎగ్గొట్టి పేపర్లలో మాత్రం గొప్పగా ప్రకటనలు ఇస్తున్నారని… ఇలా చేయడాన్ని జగన్ రైతులకు నమ్మకద్రోహం చేసినట్టు భావించాలని తెలిపారు. జగన్ ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి పేరుతో 4,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని పేర్కొన్నారు. రైతులను జగన్ మోసం చేశారని ఆరోపణలు చేశారు.

    గతంలో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం 500 రూపాయలు మాత్రమే ఇచ్చారని.. వరదల్లో ఇళ్లు మునిగొపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్లకు జగన్ సర్కార్ రేషన్ ఇస్తామని చెబుతూ వరద బాధితులతో చెలగాటమాడుతోందని అన్నారు.