Chandrababu and Jr NTR: సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినీతారలు చాలా మంది రాజకీయాల్లో రాణించి శభాష్ అనిపించుకున్నారు. సినీ గ్లామర్ కు ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఎన్టీఆర్, జయలలిత రెండు స్టేట్లను పాలించి అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఎన్నికల వేళ సినీ గ్లామర్ ను నమ్ముకుని గట్టెక్కిన వారు చాలా మంది ఉన్నారు. వారితో ఓట్లు రాబట్టుకునే ప్రణాళికలు ఇప్పటి నుంచే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది. దీంతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఎవరో ఒకరు రావాలని ఆకాంక్షిస్తున్నారు. దానికి సరైన సమాధానం అధినేతకు ప్రస్తుతం దొరికినట్లే కనిపిస్తోంది.

గతంలో కూడా చాలాసార్లు టీడీపీ సినిమా తారలను నమ్ముకుని అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఇలాంటి ప్లాన్ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న గ్లామర్ సూపర్. అందుకే ఆయనను తమ సభకు ప్రచారానికి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కు కూడా టీడీపీ అంటే అభిమానమే ఉంది. కానీ ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ వద్దకు ఓ ప్రముఖ హీరోను రాయబారిగా పంపనున్నట్లు సమాచారం. అది నెరవేరితే బాబు గట్టెక్కినట్లేనని తెలుస్తోంది.
తన తాత స్థాపించిన పార్టీ అంటూ ఆయనకు కూడా ప్రత్యేక అభిమానం ఉన్నా సినిమాల్లో మంచి పొజిషన్ లో ఉన్న ఎన్టీఆర్ ప్రచారానికి సై అంటారో లేదో అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి. ఎక్కడ సభలు జరిగినా జూనియర్ ఎన్టీఆర్ కావాలని ప్లకార్డులు ప్రదర్శించడం చూస్తుంటే ఆయనకు ఉన్న క్రేజీ ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. పైగా ఈ మధ్య కాలంలో బాబు, లోకేష్ మాటలను ప్రజలు విశ్వసించడం లేదని తెలుస్తోంది.
ప్రజల డిమాండ్ దృష్ట్యా బాబు ఎన్టీఆర్ ను తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ పరిమిత సభల్లో మాత్రమే ఆయన షో లు ఉండేలా భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బాబు ప్రతిపాదనకు అంగీకరిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం జూనియర్ ఎన్టీఆర్ కోసం పలు ప్లాన్ లు రెడీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.