Rgv: శివ సినిమాతో తెలుగు చిత్ర సీమలో ట్రెండ్ సెట్ చేసి… తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలిచి… డిఫరెంట్ పబ్లిసిటీకి బ్రాంమ్ద్ అంబాసిడర్ లా మారిపోయాడు. తన ప్రాజెక్ట్స్ కు వినూత్న పబ్లిసిటీ చేసుకోవడంలో ఆయనకు మించిన ఘణాపాటి ఇండస్ట్రీలో ఇంకొకరు లేరు అంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి. ఎప్పుడు ఏదో ఓ విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్ లో ఉండే ఆర్జీవి… రాజకీయ నాయకులు. సినీ తారలపై కూడా కామెంట్లు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదంపై రామ్ గోపాల్ వర్మ మరోసారి స్పందించారు.

ఇటీవలే మా అసోసియేషన్ లో సర్కస్ అని ట్వీట్ చేసిన వర్మ… ఇప్పుడు తాజాగా మరో ట్వీట్ చేసి మా వివాదాన్ని గుర్తు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో ఎంతటి వివాదానికి దారితీసాయో తెలిసిన విషయమే.
Cine”MAA” is a CIRCUS full of JOKERS
— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021
అయితే నిన్న తిరుపతిలో మీడియా తో మాట్లాడిన మంచు విష్ణు… సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే ప్రకాష్‌రాజ్ హ్యాపీగా చూసుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకోవడం సంచలనంగా మారింది. రిగ్గింగ్ జరిగిందని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తుంటే… అదేం లేదని మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.