Chandrababu-NTR Family: తెలుగునాట కుటుంబ రాజకీయాలకు కొత్తేమీ కాదు. టీడీపీ ఆవిర్భావంతో నందమూరి, నారా కుటుంబాలు తెరపైకి రాగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబం ప్రాబల్యం బాగా పెరిగింది. అయితే కుటుంబ విభేదాలను రాజకీయాలకు వాడుకోవడం పరిపాటి. ఎన్టీఆర్ పదవి విచ్యుతుడ్ని చేయడంలో బయట వారి పాత్ర కంటే కుటుంబసభ్యుల పాత్రే అధికం. ఆశించిన పదవులు దక్కకపోతే కరివేపాకులా వాడేసుకున్నారని ఆరోపిస్తారు. తీరా సమాన పదవులు దక్కితే ఆధిపత్యం ప్రదర్శిస్తారు. వైఎస్ కుమార్తె షర్మిళను సోదరుడు జగన్ అవసరం తీరాక వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు తొక్కేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో ఇవి సహజం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ఆయనే పార్టీలో సీనియర్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు టీడీపీ ఆవిర్భవించిన చాలా నాళ్లకు ఎన్టీఆర్ గూటికి చేరారు. అప్పటికే వెంకటేశ్వరరావు పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఎప్పుడు చేరామన్నది కాదు అన్నయ్య .. పార్టీలో పట్టు సాధించామా లేదా? అన్నది ఇంపార్టెంట్ అన్నట్టు అనతికాలంలోనే తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు తన మార్కు చూపించారు. మొత్తం పార్టీని టేకోవర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ను తోసిరాజని కుటుంబసభ్యుల సహకారంతో పార్టీని హైజాక్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తనయుల నుంచి తోడళ్లుల్లు వరకూ అందర్నీ లక్ష్మీపార్వతిని బూచీగా చూపించి పార్టీని తన చేతుల్లోకి లాక్కున్నారు. కొందరు వెన్నుపోటు అన్నారు. ఇప్పటికీ అంటున్నారు. మరికొందరు పార్టీని ఓ మహిళ కబంద హస్తాల నుంచి కాపాడుకునేందుకే అంటూ అభివర్ణిస్తున్నారు.

ఒక్కొక్కరుగా దూరం..
చంద్రబాబు చేతిలోకి పార్టీ వచ్చిన తరువాత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరూ దూరమయ్యారు. లేదు చంద్రబాబే దూరం పెట్టారన్న టాక్ ఉంది. అందుకే చెట్టుకొకరు..పుట్టకొకరు అయిపోయారు. తోడల్లుడు వెంకటేశ్వరరావుకు పార్టీలో కనీస ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో ఆయన కాంగ్రెస్ బాట పట్టాల్సి వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా, భార్య పురందేశ్వరి ఎంపీగా గెలిచారు. పురందేశ్వరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. దశాబ్దాలు గడుస్తున్నా చంద్రబాబుతో వారు కలిసింది తక్కువే. కేవలం కుటుంబ ఫంక్షన్లలో మాత్రమే కలుసుకుంటున్నా ఎడముఖం పెడముఖమే. అటువంటిది ఇటీవల తరచూ కలుస్తున్నారు. రెండు రోజుల కిందట అస్వస్థతకు గురైన వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read: KCR CBI Attacks: కేసీఆర్ పై సీబీ‘ఐ’.. కేఏపాల్ తో మోడీ నరుక్కొస్తున్నారా?
విషయం తెలుసుకున్న చంద్రబాబు నేరుగా ఆస్పత్రికి వెళ్లి తోడల్లుడును పరామర్శించారు. చాలాసేపు అక్కడే గడిపారు. పురందేశ్వరి సైతం అక్కడే ఉన్నారు. అయితే తాను బలహీనమైన ప్రతీసారి మాత్రం చంద్రబాబు దూరమైన వారిని దగ్గర చేసుకుంటారు. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుంటారు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసమేనన్న వ్యాఖ్యలు వినపిస్తున్నాయి. దగ్గుబాటి కుటుంబాన్ని మరోసారి దగ్గర చేసుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారట. వీలైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుమారుడ్ని రాజకీయంగా యాక్టివ్ చేయాలని భావిస్తున్నారట. దీనికి దగ్గుబాటి దంపతులు కూడా ఒప్పుకున్నారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య సన్నిహిత్యం బాగా పెరిగిందని టీడీపీ వర్గాల టాక్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తప్ప.. మొత్తం కుటుంబమంతా చంద్రబాబు కోసం పనిచేయడానికి సిద్ధమవుతున్నారట.
మనసు మార్చకున్న పురందేశ్వరి..
ప్రస్తుతం పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతున్నారు. జాతీయ మహిళా మోర్చాతో పాటు ఒడిశా రాష్ట్ర ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమెకు పార్టీలో సరైన గుర్తింపు అంటూ లేదు. అలాగని రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైన పరిస్థితులు కనిపించడం లేదు. రాజ్యసభకానీ, గవర్నర్ కానీ నామినేట్ చేస్తారని కూడా భావించారట. కానీ అధిష్టానం నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆమె నైరాశ్యంలో పడిపోయారట. అందుకే ప్రత్యామ్నాయ వేదిక గురించి ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో చంద్రబాబు అటు నుంచి నరుక్కురావడం ప్రారంభించారు. తాను ఒక మెట్టు దిగివచ్చినట్టు వ్యవహరించారు. దీంతో దగ్గుబాటి దంపతులు మొత్తబడ్డారు. టీడీపీలో పనిచేయడానికి మానసికంగా సిద్ధమయ్యారట. అటు కుమారుడ్ని రాజకీయ అరంగేట్రం చేయడంతో పాటు పార్టీలో యాక్టివ్ కావాలని భావిస్తున్నారట. అయితే వీరి స్కెచ్ వీరిది.. కానీ చంద్రబాబు స్కెచ్ ఉండనే ఉంటుంది కదూ. అయితే పురందేశ్వరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతే వైసీపీ నేతల స్వరం మారింది. గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పురందేశ్వరిపై ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీని వెనుక పురందేశ్వరి టీడీపీకి దగ్గరవ్వడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దూరమైన వర్గాలను..
తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. మహానాడు సక్సెస్ కావడంతో వచ్చే ఎన్నికల్లో విజయంపై పార్టీ శ్రేణుల్లో నమ్మకం తొణికిసలాడుతోంది. జిల్లాల్లో బాదుడే బాదుడు, మినీ మహానాడులకు వెళుతున్న చంద్రబాబు ప్రజాదరణ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల వరకూ ఇదే కొనసాగితే ఆయనకు విజయావకాశాలు ఉన్నట్టేనని భావిస్తున్నారు. అందుకే పనిలో పనిగా దూరమైన వర్గాలను దగ్గర చేయాలని కూడా వ్యూహకర్తలు సూచిస్తున్నారు. అందుకే పాత కాపులందర్నీ పార్టీలో యాక్టివ్ చేసే ప్రయత్నాలను ఆయన మొదలు పెట్టారు. ప్రభుత్వం, పోలీసులు అడ్డుతగిలినా ఒంగోలులో మహానాడు దిగ్విజయంగా జరిగింది. మహానాడు వ్యూహం సక్సెస్ కావటంతో..వచ్చే ఎన్నికల వరకు ఇదే జోష్ ను కొనసాగిస్తూ..జిల్లాల పర్యటనలతో నేతలు – ప్రజలతో మమేకం కావాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీడీపీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. అటు తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం గట్టి ఎదురుదెబ్బే కనిపించింది. దాదాపు టీడీపీ పని అయిపోయిందన్న వ్యాఖ్యలు వినిపంచాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ధైర్యం పోగుచేసుకొని ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కలిసివస్తుండడం, పొత్తులు తెరపైకి రావడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నమ్మకం పెట్టుకొని పోరాడుతున్నారు. చంద్రబాబు కూడా తాను మారిన మనిషిగా నిరూపించుకుంటున్నారు.
Also Read:Maharastra Political Crisis: మహారాష్ట్రలో శివసేన సర్కార్ కూలుతుందా? పరిణామాలెలా ఉన్నాయి?
[…] […]
[…] […]