https://oktelugu.com/

ఇద్దరూ.. ఇద్దరే.. ఎవరినీ తప్పుపట్టలేం

ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకోతీరు మలుపుతిప్పుతుంటాయి. అయితే.. అవి యాదృచ్చికమా.. లేక కావాలని చేస్తారో తెలియకుండానే జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. చివరకు ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి తెస్తాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఒకరు ఆధిపత్యం కోసం తండ్లాడుతుండగా.. మరొకరు సింపతి కోసం ఫైట్‌ చేస్తున్నారు. పదవులు మారినా.. హోదాలు మారినా సీన్ మాత్రం సేమ్‌. నాడు జగన్, నేడు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో […]

Written By: , Updated On : March 13, 2021 / 05:11 PM IST
Follow us on

Jagan Chandrababu
ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకోతీరు మలుపుతిప్పుతుంటాయి. అయితే.. అవి యాదృచ్చికమా.. లేక కావాలని చేస్తారో తెలియకుండానే జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. చివరకు ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి తెస్తాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఒకరు ఆధిపత్యం కోసం తండ్లాడుతుండగా.. మరొకరు సింపతి కోసం ఫైట్‌ చేస్తున్నారు. పదవులు మారినా.. హోదాలు మారినా సీన్ మాత్రం సేమ్‌. నాడు జగన్, నేడు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో అగచాట్లు పడుతున్నారు.

Also Read: తిరుపతి ఉప ఎన్నిక రేసులో ఆ నలుగురు

గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఆయన పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి జగన్‌ను వెనక్కి పంపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సు ప్రమాదం ఘటనలో బాధితులను పరామర్శించడానికి జగన్ వెళ్లినప్పుడు కూడా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలను అనేక సార్లు అరెస్ట్ చేసిన సంఘటనలు బాబు జమానాలో జరిగాయి.

ఇక ఇపుడు అధికారంలో జగన్‌ ఉన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. చంద్రబాబును విశాఖలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచే వెనక్కి పంపారు. అలాగే తిరుపతి ఎయిర్ పోర్టులోనూ అడ్డుకున్నారు. ఇక టీడీపీ నేతల సంగతి చెప్పనవసరం లేదు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ముందస్తు అరెస్టులతోపాటు అక్రమ కేసులు బనాయిస్తూ టీడీపీ నేతలను భయబ్రాంతులకు జగన్ ప్రభుత్వం గురిచేస్తోందన్న ఆరోపణలున్నాయి.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు

అయితే.. అటు చంద్రబాబు.. ఇటు జగన్‌ కూడా ఇద్దరూ ఒకేబాటన పయనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము అనుభవించిన బాధను ప్రత్యర్థికి చూపించాలన్న లక్ష్యమే జగన్, చంద్రబాబుల్లో కనిపిస్తోంది. దీనివల్ల సానుభూతి వస్తుంది. అందుకే జగన్‌ను రెచ్చగొడుతూ మరింత సానుభూతి పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని టాక్‌. జగన్‌ను ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి అని, ఫేక్ ముఖ్యమంత్రి అని పదే పదే మాట్లాడుతూ రెచ్చగొట్టి ఇలాంటి నిర్బంధాలను ఎన్ని ఎదుర్కొంటే అంత ప్లస్ అవుతుందన్నది చంద్రబాబు ఆలోచన. నిజమే కదా మరి తిరుపతి విమానాశ్రయం ఘటనలో చంద్రబాబుకు సింపతి అయితే వచ్చింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్