
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసేందుకు ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు అనౌన్స్ కూడా చేసేసింది. దీంతో ఏపీలో ప్రకంపనలు రేగడం కామన్. అక్కడ తమ పరిశ్రమను కాపాడుకునేందుకు రోడ్లపైకి రావడమూ సాధారణం. కానీ.. అదేంటో తెలంగాణలోని ఓ ముఖ్య లీడర్ కూడా పదేపదే విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావించడం ఏమిటో అర్థం కావడం లేదు. కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన తండ్రి కేసీఆర్.
Also Read: తిరుపతి ఉప ఎన్నిక రేసులో ఆ నలుగురు
తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్.. స్వల్ప కాలంలోనే సెకండ్ ప్లేస్ స్థాయికి ఎదిగారు. సందర్భం దొరికినప్పుడల్లా.. బీజేపీ లీడర్లు మీద, ఆ పార్టీ మీద దిమ్మతిరిగే పంచ్‌లు విసురుతూనే ఉంటారు. అయితే.. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌కు అద్భుతమైన ఆయుధం విశాఖ ఉక్కు రూపంలో దొరికిందని భావిస్తున్నారు. దుబ్బాక.. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిందన్నది మర్చిపోకూడదు. టీఆర్ఎస్ నేతల నోటి నుంచి వచ్చిన ప్రతి కామెంట్‌కు పంచ్‌ల రూపంలో రిప్లై ఇచ్చేవారు బీజేపీ నేతలు. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ చేతిలోకి వచ్చిన విశాఖ మాటను ఆయుధంగా మార్చుకోవటమే కాదు.. ప్రత్యర్థుల నోట వెంట మాట రాకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు.
మోడీ పరివారానికి చెక్ పెట్టే సరికొత్త ఆయుధంగా విశాఖ ఉక్కు కర్మాగారం మారింది. ప్రశ్నలు సంధిస్తున్న కొద్దీ కమలనాథులకు షాకుల మీద షాకులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే.. విశాఖ ఉక్కును కేటీఆర్ ఆయుధంగా మార్చుకున్నారని చెప్పాలి. దీనికి తోడు.. తెలంగాణలోనిఆంధ్రాప్రాంతానికి చెందిన వారి మనసులకు మరింత దగ్గర కావటమే కాదు.. పార్టీకి విశ్వసనీయమైన ఓటు బ్యాంక్‌ను కేటీఆర్ సిద్ధం చేసినట్లుగా చెప్పాలి.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఎమ్మెల్యే రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు
అందుకే.. కీలకమైన ఎన్నికల వేళ విశాఖ ఉక్కు అంశాన్ని అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చే అలవాటున్న నేతలు.. తాజాగా విశాఖ ఉక్కుపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించకుండా మౌనంగా ఉంటున్నారు. దీన్నో అవకాశంగా తీసుకున్న కేటీఆర్.. బీజేపీ నేతలపై తాను సాధించిన పట్టును పదే పదే ప్రదర్శిస్తూ.. వారిని ఆత్మరక్షణలో పడేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్