Chandrababu BJP : 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. దేశానికి రాష్ట్రపతులను, ప్రధానులను నియమించిన ఖ్యాతి. అంతటి చంద్రబాబు నోటి వెంట ఎంత మాట.. ‘తెలుగుదేశంతో పొత్తు లేదని బీజేపీ క్లారిటీ ఇవ్వడంపై’ మీడియా మిత్రులు సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. ఆయన మీడియా చేసిన ప్రచారం సంగతేందని అడిగారు. దీనికి నిట్టూర్చిన చంద్రబాబు.. ‘తెలుగుదేవం పార్టీ ఎన్డీఏలో చేరుతుందని ఎవరు ప్రచారం చేశారో వాళ్లనే అడగండి’ అని సమాధానం దాటవేశారు. ఇక మీడియా వాళ్లకు మరో ప్రశ్న లేకుండా చేశారు.

నిజానికి తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు అనుకూల మీడియా చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. ఇక బీజేపీ మౌత్ పీస్ రిపబ్లిక్ టీవీలో వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వచ్చాయని.. చంద్రబాబు బతికి బట్టకడుతాడని.. 2024 ఎన్నికల్లో మరోసారి సీఎం అవుతాడనని ఎన్నెన్నో ఊహించి రాశారు. బీజేపీ పొత్తు కోసం తన పాత పగలన్నీ వదిలిపెట్టి మరీ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోడీకి వంగి నమస్కారాలు చేశారు. ఇంత బెండ్ అయినప్పుడే ప్రత్యర్థులు ఎన్నో విమర్శలు చేసినా.. చంద్రబాబు-మోడీ దోస్తీ మొదలైందని పచ్చ మీడియా కవర్ చేసింది.
చంద్రబాబు మళ్లీ కింగ్ మేకర్ అవుతాడని టీడీపీ మీడియా ఊదరగొడుతున్న వేళ బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ బాంబు పేల్చారు. ఏపీలో తమ పొత్తు కేవలం జనసేనతోనేనని.. తెలుగుదేశం పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవడం లేదని చావుకబురు చల్లగా చెప్పారు. తెలంగాణలో అయితే ఒంటరిగా ముందుకెళుతున్నట్టు ప్రకటించారు.
దీంతో ఏపీలో పొత్తు పెట్టుకొని.. తెలంగాణ సహకరించుకొని పాలునీళ్లలా కలిసిపోదామని కలలుగన్న చంద్రబాబు ఆశలు అడియాశలయ్యాయి. తెలుగుదేశం మీడియా పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. బీజేపీతో కలిస్తే బాబుకు మంచిరోజులు వస్తాయన్న కలలుగన్న వారందరూ ఇప్పుడు నిట్టూరుస్తున్న పరిస్థితి. వాడుకొని వదిలేసే రాజకీయంలో చంద్రబాబు ఆరితేరిపోయినా.. ఇలాంటి వారి విషయంలో నిక్కచ్చిగా ఉండే బీజేపీ వారి ట్రాప్ లో పడలేదనే చెప్పాలి. ఇప్పుడు ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. ఫాఫం చంద్రబాబు, పచ్చమీడియా నోట్లో పచ్చి వెలక్కాయపడ్డ చందంగా మారింది..