Chandrababu: హరి ఓం.. ఆధ్యాత్మికత తర్వాతే బాబు రంగంలోకినా?

ప్రస్తుతం చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం తిరుమలలోని స్వామివారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకోనున్నారు.

Written By: Dharma, Updated On : December 1, 2023 3:46 pm

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు ఇంకా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించలేదు. అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముందుగా ఆయన మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. ఇంతలో ఆయనకు రెగ్యులర్ బెయిల్ లభించింది. రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కోర్టు అనుమతి కూడా ఇచ్చింది. అయినా సరే చంద్రబాబు కొద్ది రోజులు పాటు రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించకపోవడం విశేషం.

ప్రస్తుతం చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం తిరుమలలోని స్వామివారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకోనున్నారు. శనివారం విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిసెంబర్ 5న విశాఖ వెళ్ళనున్నారు. అదేరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవి పూర్తయ్యాకే ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

చంద్రబాబుకు మంజూరైన బెయిల్ పై ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అటు తనపై కేసుల విషయంలో నిబంధనలు పాటించలేదని చెబుతూ చంద్రబాబు సైతం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ అయివుంది. అదిగో ఇదిగో అంటూ నెలలు గడుస్తోంది. చంద్రబాబుపై మోపబడిన కేసుల విచారణపై కూడా క్వాష్ పిటిషన్ ప్రభావం చూపుతోంది. కానీ న్యాయస్థానం తీర్పును మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ అనుకూలంగా వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అదే జరిగితే ఆయనపై మోపబడిన కేసులన్నీ అక్రమం అని తేలుతాయి. వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం ఎన్నికల ముంగిట చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు అన్ని కేసుల్లో విచారణలు పూర్తయినందున తీర్పులు కూడా వెల్లడి కానున్నాయి. అందుకు అనుగుణంగా చంద్రబాబు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. క్వాష్ పిటిషన్ తీర్పు వస్తుందనుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఆలయాల సందర్శనలు చేస్తుండడం విశేషం.