Chandrababu Jail: జైల్లో బరువు పెరిగిన చంద్రబాబు.. ఎలా సాధ్యమైందబ్బా?

వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి ఏకంగా ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. ఎంతోమంది మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నలా ఏ పార్టీ వాళ్లు ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదు.

Written By: Dharma, Updated On : October 13, 2023 5:53 pm

Chandrababu Jail

Follow us on

Chandrababu Jail: చంద్రబాబు అనారోగ్యంపై రకరకాల కథనాలు బయటికి వస్తున్నాయి. గత 32 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన డిహైడ్రేషన్ తో పాటు అలర్జీకి గురయ్యారని తెలుస్తోంది. దీనిపై కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అటు టిడిపి నాయకులు సైతం చంద్రబాబు అనారోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి చెబుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు.

వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి ఏకంగా ట్విట్టర్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై మండిపడ్డారు. ఎంతోమంది మాజీ సీఎంలు, మంత్రులు చాలామంది జైలుకు వెళ్లారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నలా ఏ పార్టీ వాళ్లు ఇలా దిగజారుడు ఆరోపణలు చేయలేదు. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందా? లోపల ఆయన హాయిగా, ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. నిప్పు కోసం మీరు ఏదో ఒకటి చెప్పి మానసిక క్షోభకు గురి చేయకండి. ఇంటి భోజనంతో కూడా వెయిట్ లాస్ ఎలా అయ్యారో మీరే చెప్పాలి అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్యంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును హతమార్చేందుకు జైల్లో కొట్ట జరుగుతోందని ఆరోపించారు. ఈ తరుణంలో వైసీపీ నేతలు అచ్చెనాయుడు ను టార్గెట్ చేసుకున్నారు.

ఇప్పటికే చంద్రబాబు ఆరోగ్యం పై జైలు అధికారులు హెల్త్ బులిటెన్ జారీ చేశారు. హెల్త్ బులిటెన్ జారీ చేయాల్సింది వైద్యులు కదా? జైలు అధికారులు ఎలా జారీ చేస్తారు? అని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే టిడిపి ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు ఐదు కిలోల బరువు తగ్గలేదని జైలు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు జైలుకు వచ్చిన సమయంలో 66 కేజీల బరువు ఉండగా.. ఇప్పుడది 67 కేజీలకు పెరిగినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. జైల్లో చంద్రబాబు బరువు పెరిగితే టిడిపి నేతలు ఎలా తగ్గిందని చెబుతున్నారని.. బహుశా ఇంటి భోజనం తిని చంద్రబాబు బరువు పెరిగింది అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య సెటైరికల్ ఉద్యమం నడుస్తోంది.