Chandrababu- BJP: చంద్రబాబు పునరాలోచనలో పడ్డారా? బీజేపీ కలిసి రాకపోవడంతో ప్రత్యామ్నాయంపై ఫోకస్ పెట్టారా? కాషాయ దళం దరి చేరకపోవడంతో వామపక్షాలను చేరదీయ్యాలని ప్రయత్నిస్తున్నారా? జనసేన, వామపక్షాలతో కలిసి పోటీచేస్తే మంచి ఫలితముంటుందని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు వామపక్షాల నాయకులతో కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చాలాసార్లు కూటమి కూడా కట్టారు. ఆ సమయంలో లెఫ్ట్ పార్టీలకు సీట్ల పరంగా గౌరవమైన ప్రాతినిధ్యమే దక్కేది. అయితే గత కొన్నేళ్లుగా వామపక్షాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు బీజేపీతో జత కట్టారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మనసును లెఫ్ట్ పార్టీల వైపు మళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు పట్టభద్రుల స్థానాలతో పాటు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రమే బరిలో దిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేయడం లేదు. అయితే వామపక్షాల అనుబంధ కమిటీలు సంయుక్తంగా పీడీఎఫ్ కూటమిగా అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ స్థానాల్లో పోటీకి దిగారు. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వామపక్షాలదే పట్టు. కానీ గత కొన్నేళ్లుగా వామపక్షాలు వెనుకబడ్డాయి. మళ్లీ తమ ప్రాభవాన్ని పెంచుకోవాలన్న యోచనలో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహకారం కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే బీజేపీ చర్యలతో విసిగి వేశారిపోయి ఉన్న చంద్రబాబు సరికొత్త ఆలోచన చేశారు. లెఫ్ట్ పార్టీలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు వేయించాలన్నదే ఈ ఒప్పందం. టీడీపీ వారు మొదటి ప్రాధాన్యత ఓటు తమ పార్టీకి వేసుకునేలా.. రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం పీడీఎఫ్ అభ్యర్థికి వేయాలని.. అలాగే లెఫ్ట్ పార్టీలు పీడీఎఫ్ అభ్యర్థికి తొలి ప్రాధాన్యం ఓటు వేసుకొని.. రెండో ప్రాధాన్యం ఓటు మాత్రం టీడీపీకి వేసేలా చూసుకోవాలని పరస్పర అవగాహనకు వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలపాలన్నది వారి మధ్య ఒప్పందం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ కలిసి రావడం దాదాపు లేనట్టేనని సంకేతాలు రావడంతో చంద్రబాబు కొత్త పొత్తులపైశర వేగంగా ఆలోచించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లిన ప్రజలు ఆదరించలేదు. ఓట్ల బదలాయింపు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కాంగ్రెస్ ఓటు షేర్ వైసీపీకి కన్వర్ట్ అయ్యింది. అందుకే కాంగ్రెస్ తో లాభం లేదనుకొని తన పూర్వమిత్రులైన వామపక్షాలను దువ్వడం ప్రారంభించారు. ఒక వైపు బీజేపీ నేతలను సైకిలెక్కిస్తునే…మీరు కాకుండా వామపక్షాల రూపంలో గట్టి ప్రత్యామ్నాయం తమకుందని చంద్రబాబు ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలు పంపారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababu focused on alternative as bjp did not come together
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com