Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ సొంత రాష్ట్రం బీహార్. ఆ రాష్ట్రంలో ఒక మారుమూల తాజ్ పూర్ గ్రామంలో మార్చి 27, 2011లో అతడు పుట్టాడు. సూర్యవంశం తండ్రి సంజీవ్. ఇతడు వృత్తిరీత్యా రైతు. సూర్య వంశీకి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గమనించి సంజీవ్ ఒక చిన్న మైదానాన్ని నిర్మించాడు. వాళ్ళ ఇంటి పెరడును ఇందుకోసం కేటాయించాడు. ఆ తర్వాత వైభవ్ 9 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న తర్వాత అంజివ్ అతడిని సమస్త పూర్ పట్టణంలోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ అతడు రెండున్నర సంవత్సరాలు శిక్షణ పొందాడు. ఇక విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్ 16 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు మనిశ్ ఓ జా వద్ద శిక్షణ పొందుతున్నాడు.. మనిశ్ ఓ జా రంజి మాజీ ఆటగాడు.. అతడు అనేక మెలకువలు నేర్పించడంతో వైభవ్ సూర్య వంశీ రాటుదేలాడు. అందువల్లే అతడు తన పేరును ఐపీఎల్ 2025 లో నమోదు చేసుకున్నాడు.. ఇక ఐపీఎల్ నిర్వహణ కమిటీ మెగా వేలానికి సంబంధించి రూపొందించిన షార్ట్ లిస్ట్ ఆటగాళ్లలో వైభవ్ సూర్య వంశీ ఒకడు. అతడిని రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది.
12 సంవత్సరాల వయసులో
వైభవ్ సూర్యవంశీ తనకు 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బీహార్ జట్టు తరఫున విను మన్కడ్ ట్రోఫీలో ఆడాడు. కేవలం ఐదు మ్యాచ్లలో అతడు 400 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత ఏడాది నవంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాలపాడు ప్రాంతంలో అండర్ 19 క్వాడ్రా ఫుల్ సిరీస్ కోసం B U -19 జట్టుకు ఎంపిక అయ్యాడు. ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవడం కోసం వైభవ్ సూర్యవంశీ ఆడాడు. ఇంగ్లాండ్ జట్టుపై 41 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ పై 0 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇండియా – ఏ జట్టుపై ఎనిమిది రన్స్ చేశాడు. అయితే ఈ ప్రదర్శన అతనికి తుది జట్టులో స్థానం దక్కేందుకు సహకరించలేదు. అయితే ఇతడు ఇటీవల తిరిగి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రంజి జట్టులో స్థానం దక్కించుకోవడం కోసం శ్రమించాడు. ఈ ఏడాది జనవరి నెలలో పాట్నా వేదికగా ముంబై జట్టుతో జరిగిన అతడు ఆడాడు. బీహార్ రంజీ ట్రోఫీ లో ఆడం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి అతడి వయసు 12 సంవత్సరాల 284 రోజులు మాత్రమే. అంతేకాదు 1986 నుంచి ఫస్ట్ క్లాస్ టికెట్లో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ వయసు ఉన్న భారతీయ ఆటగాడిగా.. బీహార్ తరఫున రంజీ ట్రోఫీలో పాడిన రెండవ అతిపిన్న వయస్కుడిగా వైభవ్ సూర్య వంశీ రికార్డు సృష్టించాడు.
ఆ జాబితాలో వంశి స్థానం ఎంతంటే..
12 సంవత్సరాల 73 రోజుల వయస్సు ఆలీముద్దీన్, 12 సంవత్సరాల 76 రోజులతో ఎస్కే బోస్, 12 సంవత్సరాల 240 రోజులతో మహమ్మద్ రంజాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి తర్వాత వైభవ్ సూర్య వంశీ కొనసాగుతున్నాడు.. ఇక తమకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టులోకి వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ ఇచ్చాడు. 62 బంతుల్లో 104 రన్స్ చేసి.. అనూహ్యంగా రన్ అవుట్ అయ్యాడు. ఇక చెపాక్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కేవలం 13 సంవత్సరాల 188 రోజుల వయసు ఉన్న వైభవ్ కేవలం 88 బంతులను మాత్రమే ఎదుర్కొని సెంచరీ చేశాడు. ఇది యూత్ టెస్టులలో ఒక ఇండియన్ ప్లేయర్ నమోదు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నమోదయింది. మొత్తంగా రెండవ వేగవంతమైన సంచరిగా ఇది రికార్డుల్లో నిలిచిపోయింది. అయితే ఈ జాబితాలో మొయిన్ అలీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఈ ఆటగాడు 2005లో శ్రీలంక జట్టుపై 56 బంతులను ఎదుర్కొని.. 14 ఫోర్ల సహాయంతో సెంచరీ చేశాడు. ఇక త్వరలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ జరగనుంది. ఈ జట్టులో వైభవ్ ఆడుతున్నాడు.. అయితే వైభవ్ బ్రియానులారా విపరీతంగా ఆరాధిస్తాడు. అతని బ్యాటింగ్ స్టైల్ కూడా లారాను పోలి ఉంటుంది. 13 సంవత్సరాల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ జట్టు కు 1.10 కోట్లకు అమ్ముడుపోయిన ఈ యువ ఆటగాడు.. భవిష్యత్తు కాలంలో మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశం ఉంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: First class debut at the age of 12 interesting facts about vaibhav surya vamsi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com