Chandrababu Crying: 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నిండు ప్రెస్ మీట్ లో చిన్న పిల్లాడిలాగా గుక్కపెట్టి ఏడ్చేశాడు. రాష్ట్ర శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత భోరుమన్నారు. తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యాడు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం చంద్రబాబు కన్నీళ్లతో భావోద్వేగ వాతావరణంలోకి వెళ్లింది.
Also Read: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?
అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం తిడుతున్న తీరు చూసి మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. బీఏసీ సమావేశంలో సీఎం జగన్ కూడా అవహేళనగా మాట్లాడారని భోరుమన్నాడు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎందరినో ఎదురించారు. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, ఇతర సీఎంలను ఢీ అంటే ఢీ అన్నారు. కానీ వైఎస్ జగన్ రాజకీయాలకు మాత్రం ఇలా తట్టుకోలేక మీడియా ముందు ఏడ్చేయడం సంచలనమైంది. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు. ఏనాడు ఇంత బాధ భరించలేదు. బూతులు తిట్టినా.. ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం.. ఈరోజు నా భార్యను కించపరిచేలా దూషించారు. ఆమె ఏరోజు రాజకీయాల్లోకి రాలేదు. నిండుగౌరవ సభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ఈరోజు నా కుటుంబానికి.. గతంలో వైఎస్ఆర్ నా తల్లిని అవమానించారు. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పారు. జగన్ భస్మాసురుడు. 40 ఏళ్లు పనిచేసింది ఇలా అవమానపడడానికా.? నాకు బూతులు రాక కాదు.. అది మా విధానం కాదు’ అంటూ చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు.
ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎందరో ఉద్దండ పిండాలను తుత్తునియలు చేశారు చంద్రబాబు. బలమైన మీడియాను, పత్రికలను చేతబట్టి అధికారపక్షాలను ఉచ్చపోయించాడు. ఇప్పటికీ అదే మీడియాతో షేక్ చేస్తున్నాడు. ఇక వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అలాంటి చంద్రబాబు చేత కూడా జగన్ కన్నీళ్లు పెట్టించాడంటే ఏంత తోపునో అర్థం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడుతానని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా శపథం చేశారు. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా.. తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వాపోయారు. కుప్పంలో గెలిచి చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్ లో తన భార్య గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. తీవ్ర ఆవేదనతోనే ఇక తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని సభ నుంచి వెళ్లిపోయారు.
చంద్రబాబు ఏడ్చిన వీడియో ఇదే
Also Read: చంద్రబాబు.. నాడు ఏడిపించాడు.. నేడు ఏడ్చాడు