https://oktelugu.com/

Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ప్రస్తుతం సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక కిరణ్ అబ్బవరం లాంటి నటుడు సైతం ఇంతకుముందు వరుస సినిమాలను చేస్తూ ప్లాపులను మూట గట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం భారీ సక్సెస్ లను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2024 / 11:41 AM IST

    What is the relationship between Kiran Abbavaram's movie 'Ka' and Pawan Kalyan..?

    Follow us on

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ అండ్ సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ముఖ్యంగా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులందరిని కట్టిపడేసే స్క్రీన్ ప్లే తో వచ్చాడు. ఇక ఇలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా వాటికి మంచి ఆదరణ దక్కుతుందని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇక మొత్తానికైతే సినిమాలను చేసి సక్సెస్ లను సాధించే హీరోలలో కిరణ్ అబ్బవరం కూడా ఒకరుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద కొంతవరకు విమర్శలు వస్తున్నప్పటికి సినిమా కంటెంట్ ను బేస్ చేసుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఎంగేజింగ్ గా ఉండడంతో సినిమా మొదటినుంచి చివరి వరకు ప్రేక్షకులను అల్లరిస్తూ వచ్చింది. ఇక అందువల్ల సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ అయితే దక్కింది…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టాడు…ఇక ఇదిలా ఉంటే తను ‘ క’ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ తనకి ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో వైవిధ్య భరితమైన సినిమాలను చేశాడు.

    మధ్యలో కొన్ని రొటీన్ సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు ‘ఓజీ’ అనే టైటిల్ తో ఒక భారీ పాన్ ఇండియా సినిమాని చేస్తున్నాడు… ఇక తన అభిమాన హీరో కూడా పవన్ కళ్యాణ్గారే కావడంతో ఆయన ఇన్స్పిరేషన్ తోనే కిరణ్ కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని నిశ్చయించుకున్నాడట.

    ఇక ఆ క్రమంలోనే క సినిమా కథని దర్శకులు వినిపించడం ఆ కథ తనకు బాగా నచ్చి చేద్దామని చెప్పి సినిమాను చేశాడు. ఇక ఈ సినిమా మొత్తానికైతే 15 కోట్లతో తెరకెక్కినప్పటికి ఈ సినిమా ఇప్పుడు కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా ఇలాంటి ఒక హీరో తనదైన రీతిలో తన సినిమాని ప్రమోట్ చేసుకొని అలాగే దర్శకులకు కూడా మంచి సినిమాని అందించడంలో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యాడు.

    ఇక తన అభిమాన హీరో అయిన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ కి వెళ్తున్నప్పుడు తను కూడా వెళ్లాలని నిశ్చయించుకొని అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఘట్స్ తో కూడుకున్న వ్యవహారమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన ఒక్కసారిగా హీరోగా ఇండస్ట్రీలో ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి…