https://oktelugu.com/

వైరల్: కొడుకు కేటీఆర్ పై కేసీఆర్ కామెడీ

వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నసీఎం కేసీఆర్ తన ప్రసంగలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో రాను రాను శైలి మారుతోంది. ఒకప్పుడు కేసీఆర్ ఆగ్రహంతో.. ఆవేశంతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు కూల్ గా.. పంచ్ లు.. ప్రాసలు.. ఛలోక్తులు.. వేస్తూ కామెడీ పండిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు మాని చేసిన అభివృద్ధిని మాత్రమే కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనలు ఇలా ప్రజలను ఆకట్టుకోవడానికి కారణం హుజూరాబాద్ ఉప ఎన్నికేనా..? అని ప్రతిపక్షాల విమర్శలైతే రానే వస్తున్నాయి. తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2021 / 10:42 AM IST
    Follow us on

    వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తున్నసీఎం కేసీఆర్ తన ప్రసంగలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రసంగంలో రాను రాను శైలి మారుతోంది. ఒకప్పుడు కేసీఆర్ ఆగ్రహంతో.. ఆవేశంతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడు కూల్ గా.. పంచ్ లు.. ప్రాసలు.. ఛలోక్తులు.. వేస్తూ కామెడీ పండిస్తున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు మాని చేసిన అభివృద్ధిని మాత్రమే కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. అయితే కేసీఆర్ పర్యటనలు ఇలా ప్రజలను ఆకట్టుకోవడానికి కారణం హుజూరాబాద్ ఉప ఎన్నికేనా..? అని ప్రతిపక్షాల విమర్శలైతే రానే వస్తున్నాయి.

    తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి కేసీఆర్ ప్రసంగంలో ప్రత్యేక శైలి ఉంటుంది. ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విధంగా కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అందుకే వ్యాఖ్యలకే చాలా మంది జనం ఆకర్షితులయ్యారు. అయితే ఈమధ్యలో కేసీఆర్ ఎక్కువగా కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు. కరోనా విషయంలోనూ కేసీఆర్ కామెడీగా తీసుకోవడం గమనార్హం. తాజాగా కేసీఆర్ సిరిసిల్ల పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెడీ ఆకట్టుకుంది.

    ‘మీ ఎమ్మెల్యే భోజన సమయానికి అన్నం పెడతారా..? లేక ఖాళీ కడుపుతోనే పంపిస్తారా..? అనడంతో జనం ఘొల్లుమన్నారు. గతంలో వరంగల్ లో ఇలాగే నాలుగు గంటల దాకా పనిచేయించుకొని చివరికి నమస్కారం పెట్టర్రు. దీంతో యశ్వంతపూర్ వాగు దగ్గర చిన్న హోటల్ కనిపించింది. అక్కడ ఒకామె పెరుగన్నం తీసుకొచ్చి ఆకలి తీర్చింది’ అని కేసీఆర్ తన గతం గురించి చెప్పాడు.

    ఇక ‘మా నియోజకవర్గానికి ఇప్పటికే మస్తు ఇచ్చిండ్రు.. మీరు ప్రారంభోత్సవానికి వస్తే చాలు అన్నారు.. కానీ ఇక్కడికి వచ్చాకా.. మెడికల్ కళాశాల దుకాణం పెట్టిండ్రు.. ’అని ఛలోక్తులు విసిరారు. అయితే తప్పకుండా సిరిసిల్లకు మెడికల్ కళాశాల మంజూరవుతుంది. అందులో డౌటేమీ లేదు అని కేసీఆర్ తెలిపారు. ఇలా తన ప్రసంగమంతా ఆసక్తిగా సాగింది. అయితే జిల్లాల పర్యటనల్లో కేసీఆర్ ఇలా నవ్వులతో జనాలను ఆకట్టుకోవడంతో టీఆర్ఎస్ నాయకులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.