Homeఆంధ్రప్రదేశ్‌Chalo Vijayawada: జనసంద్రమైన విజయవాడ.. అండర్‌గ్రౌండ్‌లోకి ఉద్యోగసంఘాల నేతలు

Chalo Vijayawada: జనసంద్రమైన విజయవాడ.. అండర్‌గ్రౌండ్‌లోకి ఉద్యోగసంఘాల నేతలు

Chalo Vijayawada: ఏపీ ప్రభుత్వం పీఆర్సీ‌పై తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీతో పాటు హెచ్‌ఆర్ఏ తగ్గింపుపై జగన్ ప్రభుత్వం ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిందని, తమను ప్రభుత్వం మోసం చేసిందని ఏకంగా సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం సమ్మెకు వెళ్లొద్దని చర్చలకు రావాలని పిలుస్తున్నారు.

Chalo Vijayawada
Chalo Vijayawada

కానీ వారు మాత్రం తమకు స్పష్టమైన హామీలు ఇస్తేనే సమ్మె విరమిస్తామని పట్టబట్టడంతో అక్కడి పరిస్థితులు ఉధృతంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో భాగంగా ఉద్యోగ నేతలు అండర్ గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయారు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయటానికి పోలీసులు ఉద్యోగుల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నేతలను పోలీసులు ముందస్తు అదుపులోకి తీసుకోవటం, హౌస్ అరెస్టులు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవటంలో భాగంగా పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్ రెడ్డి తదితరులు అండర్ గ్రౌండ్‌కు వెళ్ళిపోయారు.

Also Read: పవన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు..? కారణమేంటి?

ఎట్టి పరిస్ధితుల్లోను పోలీసులకు తాము దొరక్కూడదన్న ఉద్దేశ్యంతోనే కీలక నేతలంతా తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వాళ్ళ ఇళ్ళల్లోను, అసోసియేషన్ కార్యాలయాల్లోనూ లేరు. తమ ఫోన్లను కూడా స్విచ్చాఫ్ చేశారు. వీళ్ళు నలుగురు నేతలు ఒకటే చోటున్నారా? లేకపోతే వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారా అన్న విషయం కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు అలాగే జిల్లాల నుంచి ఎవరూ విజయవాడకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఉద్యోగులకు గురువారం నాడు ఎంతో అవసరమైతే తప్ప సెలవులు ఇవ్వద్దని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

మొత్తం మీద ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘాల నేతలకు మొదలైన వివాదం ముదురుతోంది. ఒకవైపు కోర్టు కూడా ఉద్యోగుల సమ్మె విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులో కేసు వేసిన ఉద్యోగులు మళ్ళీ సమ్మె ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఉద్యోగులు మాత్రం కోర్టు తీర్పును పట్టించుకోవటంలేదు. ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయటమే తమ టార్గెట్‌గా ఉద్యోగ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది.

Also Read: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular