కేసీఆర్, మోడీ కలల సౌధాలకు ఏమైంది?

ఢిల్లీలో సెంట్రల్ విస్టా, సచివాలయ నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా నేపథ్యంలో నిర్మాణాలపై ప్రభావం పడింది. కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావించిన నిర్మాణాల విషయంలో పట్టుబట్టినా పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంతో కూలీలు సైతం తమ సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ విస్టా, సచివాలయ నిర్మాణాలపై పెను ప్రభావం పడుతోంది. సెంట్రల్ విస్టాలోని ప్రధాన భాగమైన ప్రధానమంత్రి నివాసాన్ని సమమయంలోగా పూర్తి చేయాలని కేంద్రం కాంట్రాక్టర్ కు సూచించింది. […]

Written By: Srinivas, Updated On : May 6, 2021 6:29 pm
Follow us on

ఢిల్లీలో సెంట్రల్ విస్టా, సచివాలయ నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా నేపథ్యంలో నిర్మాణాలపై ప్రభావం పడింది. కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావించిన నిర్మాణాల విషయంలో పట్టుబట్టినా పనులు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంతో కూలీలు సైతం తమ సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ విస్టా, సచివాలయ నిర్మాణాలపై పెను ప్రభావం పడుతోంది. సెంట్రల్ విస్టాలోని ప్రధాన భాగమైన ప్రధానమంత్రి నివాసాన్ని సమమయంలోగా పూర్తి చేయాలని కేంద్రం కాంట్రాక్టర్ కు సూచించింది. దీన్ని అత్యవసర సర్వీసుల కేటగిరిలోకి చేర్చి నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావించింది.

మందకొడిగా నిర్మాణాలు
కొత్త సచివాలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా నిర్మాణం పూర్తి చేయించాలని తలపించారు. సచివాలయ భవన నిర్మాణాన్ని 2019 జూన్ 26న పనులు ప్రారంభించి 12 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు 20 నెలలు పూర్తయినా ఇంకా నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోలేదు. పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా నేపథ్యంలో..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సెంట్రల్ విస్టా, సెక్రటేరియట్ నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంతో పనులు ముందుకు సాగడం లేదు. సీఎం కేసీఆర్ ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా నిర్దేశిత లక్ష్యం చేరడం లేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిర్మాణాలు ఆపే ప్రసక్తే లేదని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తేల్చి చెప్పాయి. సెంట్రల్, విస్టా, సెక్రటేరియట్ లు అనుకున్న సమయంలో నిర్ణీత పద్ధతిలో నిర్మాణాలు పూర్తి చేసే క్రమంలో ఎలాంటి పరిణామాలనైనా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నాయకుల పర్యవేక్షణ
సెంట్రల్ విస్టా, సచివాలయ నిర్మాణాలపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి. ఎలాగైనా అనుకున్న గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో నాయకులు పనులపై పర్యవేక్షణ చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు. పనుల నిర్వహణలో పట్టించుకున్నా ముందుకు సాగకపోవడంపై పలుమార్లు దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సెంట్రల్ విస్టా, సెక్రటేరియట్ పనులు చురుకుగా సాగేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.